ACB Raids 15 officials : 15 మంది అధికారుల ఇళ్లల్లో ఏసీబీ ఒకేసారి సోదాలు..

క‌ర్ణాట‌క‌లో అవినీతి నిరోధ‌క శాఖ‌(ఏసీబీ) అధికారుల పలువురు అధికారుల ఇళ్లపై మూకూమ్మడి సోదాలు నిర్వహించారు.68 ప్రాంతాల్లో 15మంది అధికారుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

ACB search operations in Karnataka : క‌ర్ణాట‌క‌లో అవినీతి నిరోధ‌క శాఖ‌(ఏసీబీ) అధికారుల పలువురు అధికారుల ఇళ్లపై మూకూమ్మడి సోదాలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు ఒకేసారి 68 ప్రాంతాల్లో 15మంది ప్రభుత్వం అధికారుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బెంగుళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA) ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాల్లో కూడా ఏసీబీ బుధవారం (నవంబర్ 24,2021) తెల్లవారుఝామునుంచి సోదాలు నిర్వహిస్తున్నారు.

Read more : Telangana : కిడ్నీ రోగుల‌కు ఉచితంగా డ‌యాల‌సిస్‌..ప్ర‌త్యేక కేంద్రాల ఏర్పాటుకు మంత్రి ఆదేశం

8 మంది ఎస్పీలు, 100 మంది అధికారులు, దాదాపు 400 మంది ఏసీబీ సిబ్బంది నేతృత్వంలోని పలు బృందాలు మంగళూరు, బెంగళూరు, మండ్యలతో పాటు మరికొన్ని జిల్లాల్లోని 15 మంది ప్రభుత్వ అధికారులు, వారి బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 68 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నార‌నే ఆరోప‌ణ‌ల‌పై ఏసీబీ అధికారులు సోదాల‌ను ముమ్మ‌రం చేశారు.

Read more : Tamannaah Bhatia : అరిటాకులో భోజనం.. దేవతలా మారిన తమన్నా..

ట్రెండింగ్ వార్తలు