Ranya Rao Arrest : కన్నడ నటి రాన్యా రావ్ అరెస్ట్ అయ్యారు. బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చారనే కారణంతో డీఆర్ఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి ఆమె తీసుకొచ్చిన దాదాపు 15 కేజీల బంగారాన్ని బెంగళూరు ఎయిర్ పోర్టులో డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
రాన్యా ఇటీవల తరుచుగా దుబాయ్ వెళ్లి వస్తుండటంతో ఆమెపై నిఘా పెట్టారు అధికారులు. 15 రోజుల వ్యవధిలో 4 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చిన రాన్యా గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో దాచి తీసుకొచ్చినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.
Also Read : ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం..
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రాన్యా రావ్ ని అరెస్ట్ చేసినట్లు బెంగళూరు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. నటి రాన్యా సోమవారం రాత్రి దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఫ్లైట్ లో బెంగళూరు వచ్చారు. రాన్యా ఇటీవలి కాలంలో తరుచుగా ఫారిన్ ట్రిప్స్ కు వెళ్తున్నారు. దీంతో డీఆర్ఐ అధికారులకు ఆమెపై అనుమానం వచ్చింది. వెంటనే ఆమెపై నిఘా పెట్టారు.
దుబాయ్ నుంచి వచ్చిన రాన్యాను అధికారులు కెంపె గౌడ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. ఆమెని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అంతే, వారికి షాక్ తగిలినంత పనైంది. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. బంగారాన్ని చాలావరకు కనిపించకుండా ధరించగలిగిందని, అదే సమయంలో తన దుస్తుల్లో బంగారు కడ్డీలను రాన్యా రావ్ దాచిపెట్టిందని అధికారులు తెలిపారు.
రాన్యా రావ్ కర్నాటకకు చెందిన డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి కూతురు. గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాఫ్తు చేపట్టారు. రాన్యా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, గోల్డ్ స్మగ్లింగ్ వెనుక ఎవరి హస్తం ఉంది అనే కోణంలో విచారిస్తున్నారు.
కన్నడ సూపర్ స్టార్ సుదీప్ సరసన మాణిక్య మూవీలో రాన్యా నటించింది. పలు సౌత్ ఇండియన్ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. రాన్యాను అదుపులోకి తీసుకున్న అధికారులు.. మరింత లోతుగా దర్యాఫ్తు చేసేందుకు ఆమెను బెంగళూరులోని డీఆర్ఐ హెడ్ క్వార్టర్స్ కి తరలించారు.