Singer Kalpana : ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం..

హైదరాబాద్ నిజాంపేట్ లోని వర్టెక్స్ ప్రివిలేజ్ లో కల్పన తన భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు.

Singer Kalpana : ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం..

Updated On : March 5, 2025 / 1:18 AM IST

Singer Kalpana : ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేశారు. తన ఇంట్లో నిద్ర మాత్రలు మింగి కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె హోలిస్టిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ నిజాంపేట్ లోని వర్టెక్స్ ప్రివిలేజ్ లో కల్పన తన భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు.

రెండు రోజులుగా కల్పన తన ఇంటి తలుపులు తెరవలేదు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి లోనికి వెళ్లారు. మంచంపై అచేతన స్థితిలో కల్పన కనిపించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా, కల్పన బలవన్మరణానికి పాల్పడటానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన టాలీవుడ్ లో తీవ్ర కలకలం రేపింది.

Also Read : వీడెవడండీ బాబూ.. కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం అంబులెన్స్ సైరన్ దుర్వినియోగం..

గడిచిన రెండు రోజులుగా కల్పన తన ఇంటి తలుపులు తెరవలేదని ఇంటి చుట్టుపక్కల ఉండే వారు చెప్పారు. ఏం జరిగిందో తెలియక కంగారుపడ్డామన్నారు. ఎందుకైనా మంచిదని పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. మంచంపైన కల్పన స్పృహ లేకుండా పడి ఉన్నారు. వెంటనే పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంటలేటర్ పై కల్పనకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. అసలేం జరిగింది? కల్పన ఎందుకు బలవన్మరణయత్నానికి పాల్పడ్డారు? అనేది తెలియాల్సి ఉంది.

కల్పన టాలీవుడ్‌లో ప్రముఖ సింగర్‌ గా గుర్తింపు పొందారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో అనేక పాటలు పాడారు. సింగర్‌గానే కాదు డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గానూ మంచి గుర్తింపు పొందారు కల్పన.

సింగర్ కల్పన కేసులో పోలీసులు విచారణ చేస్తున్నారు. గత రెండు రోజులుగా కల్పన ఇంట్లోనే ఉండిపోయారు. కల్పన భర్తపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గత రెండు రోజులుగా తాను ఇంట్లో లేని కల్పన భర్త చెబుతున్నాడు. కల్పన భర్తను ఆసుపత్రి నుంచి తీసుకుని ఇంటికి వెళ్లారు పోలీసులు. కల్పన ఇంట్లో మరొకసారి తనిఖీలు చేశారు.