Ambulance Siren Misuse : వీడెవడండీ బాబూ.. కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం అంబులెన్స్ సైరన్ దుర్వినియోగం..

ఓ వ్యక్తి చేసిన పని పోలీసులకు తీవ్రమైన కోపం తెప్పించింది.

Ambulance Siren Misuse : వీడెవడండీ బాబూ.. కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం అంబులెన్స్ సైరన్ దుర్వినియోగం..

Updated On : March 5, 2025 / 11:25 AM IST

Ambulance Siren Misuse : అంబులెన్స్ సైరన్ వినిపిస్తే చాలు.. అందరూ పక్కకి జరుగుతారు. అంబులెన్స్ ముందుకు వెళ్లేందుకు దారిస్తారు. ఎందుకంటే అందులో ఎవరో అత్యవసర పరిస్థితుల్లో ఉన్నారని, రోగిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని అంబులెన్స్ సైరన్ వినిపించగానే ఆటోమేటిక్ గా దారి ఇచ్చేస్తారు. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తరలించాల్సి ఉంటుంది. వీలైనంత తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్తే వారి ప్రాణాలను కాపాడే ఛాన్స్ ఉంటుంది. అందుకే, అంబులెన్స్ సైరన్ వినిపించగానే అందరూ పక్కకు తప్పుకుంటారు.

ఎమర్జెన్సీ పరిస్థితుల్లో రోగి ప్రాణాలను కాపాడేందుకు అంబులెన్స్ సైరన్ వాడతారనే విషయం తెలిసిందే. కానీ, హైదరాబాద్ పంజాగుట్టలో ఓ వ్యక్తి చేసిన పని పోలీసులకు తీవ్రమైన కోపం తెప్పించింది. ఓ వ్యక్తి ఓవరాక్షన్ చేశాడని పోలీసులు అంటున్నారు. కుక్క కోసం అంబులెన్స్ సైరన్ ని దుర్వినియోగడం చేయడం హాట్ టాపిక్ గా మారింది.

కుక్కకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం సైరన్ తో అంబులెన్స్ లో వచ్చాడో వ్యక్తి. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఘటన జరిగింది. అంబులెన్స్ సైరన్ దుర్వినియోగంపై ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా అంబులెన్స్ లను ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అతి వేగంగా సైరన్ తో ఓ అంబులెన్స్ అక్కడికి వచ్చింది.

Also Read : మిషన్ అరుస్తుందిక్కడ.. రోడ్డుపై చెత్త వేశారనుకో.. మీ పని గోవిందా..

స్పెషల్ డ్రైవ్ లో ఉన్న పోలీసులకు ఎందుకో డౌట్ వచ్చింది. ఆ అంబులెన్స్ లోపల రోగి ఉన్నాడా లేడా అని చూసేందుకు డోర్ తీసి చూశారు. అంతే, ట్రాఫిక్ పోలీసులు షాక్ కి గురయ్యారు. అంబులెన్స్ లో రోగి లేడు. ఓ పెంపుడు కుక్క ఉంది. ఆ కుక్క తరలింపు కోసం అతడు అంబులెన్స్ సైరన్ వాడుకున్నాడని తెలిసి విస్తుపోయారు.

మియాపూర్ లోని ఆస్పత్రిలో కుక్కకు వేసెక్టమి ఆపరేషన్ కోసం తీసుకువెళ్తున్నానంటూ అంబులెన్స్ డ్రైవర్ సమాధానం ఇచ్చాడు. ఆ సమాధానం విని పోలీసులు బిత్తరపోయారు. రోగులను తరలించేందుకు వాడాల్సిన అంబులెన్స్ సైరన్ ను ఇలా కుక్క కోసం వాడటం ఏంటని ఫైర్ అయ్యారు. అంబులెన్స్ సైరన్ దుర్వినియోగంపై ట్రాఫిక్ పోలీసుల సీరియస్ అయ్యారు. అంబులెన్స్ యజమాని మీద కేసు నమోదు చేశారు.

”అత్యవసర అంబులెన్స్ సేవల దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. వైద్య అత్యవసర పరిస్థితి కోసం కాకుండా కుక్కలను రవాణ చేయడానికి సైరన్ ఉపయోగించి పట్టుబడింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పంజాగుట్ట వద్ద ఏసీపీ హరిప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా అంబులెన్స్‌ను ఆపినప్పుడు ఈ సంఘటన వెలుగుచూసింది.

అంబులెన్స్ ప్రాథమిక ఉద్దేశ్యం తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను ఆసుపత్రులకు సకాలంలో తరలించడం ద్వారా ప్రాణాలను కాపాడటం. వైద్య అత్యవసర పరిస్థితిలో ప్రతి సెకను లెక్కించదగినది. కాబట్టి అంబులెన్స్‌కు దారి ఇవ్వడం ప్రాథమిక బాధ్యత. అయితే, కొంతమంది వ్యక్తులు ఇప్పుడు ఈ వ్యవస్థను వ్యక్తిగత లాభాల కోసం ఉపయోగించుకుంటున్నారు” అని పోలీసులు తెలిపారు.

Also Read : ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్‌ఎండీఏ గుడ్‌న్యూస్‌.. ఫీజు చెల్లిస్తే కేవలం 10 రోజుల్లో..

రోగి లేనప్పుడు కూడా అనేక మంది అంబులెన్స్ డ్రైవర్లు, ఆపరేటర్లు సైరన్ లు మోగించడం ద్వారా ట్రాఫిక్ మినహాయింపులను దుర్వినియోగం చేస్తున్నారు. రోగులకు బదులుగా కుక్కలను రవాణ చేస్తూ అంబులెన్స్ పట్టుబడిన తాజా ఘటన ఇటువంటి అనైతిక పద్ధతుల గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తింది.

ఈ మధ్య కాలంలో అనేకమంది అంబులెన్స్ అత్యవసర సేవలను దుర్వినియోగం చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీటికి చెక్ పెట్టేందుకు నిఘా పెంచారు. స్పెషల్ డ్రైవ్ లు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ అంబులెన్స్ లను ఆపి అందులో రోగి ఉన్నాడో లేదో చెక్ చేస్తున్నారు.