LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్‌ఎండీఏ గుడ్‌న్యూస్‌.. ఫీజు చెల్లిస్తే కేవలం 10 రోజుల్లో..

క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్‌స్పేస్‌ ఛార్జీలు కలిపి చెల్లిస్తే 25 శాతం రాయితీ వస్తుంది

LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్‌ఎండీఏ గుడ్‌న్యూస్‌.. ఫీజు చెల్లిస్తే కేవలం 10 రోజుల్లో..

Updated On : March 4, 2025 / 9:41 AM IST

అనుమతిలేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) కోసం ఎదురుచూస్తున్న వారికి హెచ్‌ఎండీఏ గుడ్‌న్యూస్‌ చెప్పింది. దరఖాస్తులను పరిష్కరించేందుకు వేగంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. రుసుము చెల్లించిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను కేవలం 10 రోజుల్లోనే పరిష్కరిస్తామని చెప్పింది.

క్రమబద్ధీకరణ ఫీజు, ప్రో రేటా ఓపెన్‌ స్పేస్‌ రుసుమును మార్చి 31గా చెల్లించిన వారికి 25 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపింది. డిస్కౌంట్ కావాలనుకున్న అర్హులు ఆలోపు అప్లై చేసుకోవాలని చెప్పింది.

పలు కారణాల వల్ల అప్లికేషన్‌ను తాము తిరస్కరిస్తే ప్రాసెసింగ్‌ చార్జీల కింద 10 శాతం మినహాయించుకుని, మిగతా 90 శాతాన్ని దరఖాస్తుదారుడికి ఇస్తామని తెలిపింది. నిషేధిత లిస్టులోలేని భూములతో పాటు చెరువులు, కుంటలు వంటివాటికి 200 మీటర్ల పరిధిలోలేని ప్లాట్ల అప్లికేషన్లకు ఆటోమేటిక్‌గా ఫీజుకు సంబంధించిన వివరాలు వస్తాయి.

వాటి పరిధిలోకి వచ్చే అప్లికేషన్లు రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు పంపుతారు. ఓపెన్‌ స్పేస్‌ రుసుము కట్టకుండానే ఎల్‌ఆర్‌ఎస్‌కు అప్లై చేసుకోవచ్చు. క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించొచ్చు. ఇటువంటి అప్లికేషన్లకు డిస్కౌంట్ మాత్రం రాదు. అలాగే, భవన నిర్మాణం సమయంలో ప్రొ-రేటా ఓపెన్‌ స్పేస్‌ రుసుమును చెల్లించాల్సి వస్తుంది. డిస్కౌంట్‌ కావాలనుకుంటే ఆ రెండు రుసుములను కలిపి చెల్లించడం మంచిది.

ఇలా స్టేటస్‌ తెలుసుకోండి

  • ఎల్‌ఆర్‌ఎస్‌ పోర్టల్‌ ఓపెన్‌ చేయండి
  • సిటిజన్‌ లాగిన్‌ కింద మీ మొబైల్‌ నంబరు ఎంటర్‌ చేయండి
  • మీకు వచ్చే ఓటీపీతో లాగిన్‌ అవ్వండి
  • మీ అప్లికేషన్ స్టేటస్‌ వస్తుంది
  • దరఖాస్తును తిరస్కరిస్తే కారణాలు కూడా అందులో ఉంటాయి
  • అప్లికేషన్‌ రిజెక్ట్‌ కాకపోతే పోర్టల్‌లో ఫీజు చెల్లించాలి
  • క్రమబద్ధీకరణ ఫీజు, ఓపెన్‌స్పేస్‌ ఛార్జీలు కలిపి చెల్లిస్తే 25 శాతం రాయితీ వస్తుంది