వరదనీటిలో మోడల్ వయ్యారాలు

వరద నీటిలో సతమతమవుతుంటే ఈ యువతి మాత్రం రెడ్ డ్రెస్ వేసుకుని కారు పక్కన నిల్చొని హొయలు పోతూ ఫొటో షూట్ చేసింది. ఇది ఫేమస్ అవడానికో.. చౌకబారు తెలివితేటలో కాదు. బీహార్‌లో కురుస్తున్న వర్షాలు. అక్కడి స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు బయట ప్రపంచానికి తెలియజేయాలని వినూత్న ప్రయత్నం చేశారు కొందరు. వరద నీటిలో తడుస్తూనే ఫొటో షూట్ చేశారు.

రోడ్లన్నీ మునిగిపోయి సముద్రాన్ని తలపిస్తున్నాయని, వరద నీరు దుకాణాల్లోకి చేరిపోవడంతో మనుగడకు చాలా సమస్యలు ఎదురవుతున్నాయని వాపోయారు. ఈ పరిస్థితిని కనిపించేలా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్ ఎరుపు రంగు దుస్తుల్లో ఫొటో షూట్ చేసింది. అదితి సింగ్ అనే అమ్మాయి చేసిన ఫొటో షూట్ ప్రజల్లోకి వెళ్లడంతో పట్నా పరిస్థితి అందరికీ తెలిసేలా చేశారు.

బీహార్‌లోని పలు జిల్లాల్లో కురుస్తోన్న భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసి, రాబోయే కొద్ది రోజులు ఇళ్లు దాటి బయటకు రావొద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. 

ముందుజాగ్రత్తగా, పట్నాతో పాటు పరిసర జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలు మూసేశారు. వర్షాల కారణంగా రాష్ట్ర రవాణా వ్యవస్థ కూడా దెబ్బతింది. పరిస్థితి చక్కబడేంతవరకూ బస్సు, రైళ్లు సర్వీసులు రద్దు చేశారు. 
 

ట్రెండింగ్ వార్తలు