Visakhapatnam IIM : విశాఖ ఐఐఎం లో పిజీపీ లో ప్రవేశాలు

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. జనవరి 11 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది.ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 2022 మార్చి 15 గా నిర్ణయించారు.

Visakhapatnam IIM : విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రోగ్రామ్‌ వ్యవధి రెండేళ్ల కాలం. దీనికి బెంగళూరు ఐఐఎం మెంటార్‌గా వ్యవహరిస్తుంది. ఈ ప్రోగ్రామ్‌ పూర్తిచేసినవారికి ఎంబీఏ డిగ్రీ ప్రదానం చేస్తారు.

దరఖాస్తు చేసే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. క్యాట్‌ 2021 అర్హత పొంది ఉండాలి. ఈ ఎగ్జామ్‌లో ఒక్కో సెక్షన్‌లో కనీసం 70 శాతం మార్కులతోపాటు మొత్తమ్మీద 80 శాతం స్కోర్‌ సాధించి ఉండాలి. స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్ప్‌ను కూడా దరఖాస్తుకు జతచేయాలి.

ఎంపిక విధానం విషయానికి వస్తే క్యాట్‌ స్కోర్‌, స్టేట్‌మెంట్‌ ఆఫ్‌ పర్పస్‌ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. వీరిలో పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ స్థాయుల్లో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకొని క్యాట్‌ స్కోర్‌కు 50 శాతం, పదోతరగతి నుంచి డిగ్రీ వరకు ఒక్కో స్థాయి మెరిట్‌కు 10 శాతం, జెండర్‌ డైవర్సిటీ, అనుభవాలకు ఒక్కోదానికి 10 శాతం వెయిటేజీ ఇస్తూ ఎంపిక చేసిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. జనవరి 11 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ 2022 మార్చి 15 గా నిర్ణయించారు. పర్సనల్‌ ఇంటర్వ్యూకి ఎంపికైనవారికి ఫోన్‌కాల్స్‌ 2022 ఏప్రిల్‌ 4 నుంచి 8 వరకు నిర్వహిస్తారు. పర్సనల్‌ ఇంటర్వ్యూలు ఏప్రిల్‌ 11 నుంచి మే 11 వరకు జరుగుతాయి.

ప్రోగ్రామ్‌ రిజిస్ట్రేషన్‌ 2022 జూన్‌ 24జరుగుతుంది. ఓరియంటేషన్‌ 2022 జూన్‌ 25, 26 తేదిలలో నిర్వహిస్తారు. ప్రిపరేటరీ ప్రోగ్రామ్‌ 2022 జూన్‌ 27 నుంచి జూలై 2 వరకు కొనసాగుతుంది. ప్రోగ్రామ్‌ 2022 జూలై 4న ప్రారంభమౌతుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: iimv.ac.in సంప్రదించగలరు.

ట్రెండింగ్ వార్తలు