Paragliding: పారాగ్లైడింగ్ చేస్తూ ఎత్తైన పోల్‌కు చిక్కుకుపోయిన గ్లైడర్, మహిళా టూరిస్ట్.. రక్షించిన అధికారులు
మంగళవారం కేరళలో పారాగ్లైడింగ్ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. కేరళలోని వర్కాల బీచ్‌లో తమిళనాడుకు చెందిన ఒక మహిళ పారాగ్లైడింగ్ చేసింది. ఆమెను ఒక ప్రొఫెషనల్ పారాగ్లైడర్ తనతోపాటు పారాషూట్ ద్వారా గాల్లోకి తీసుకెళ్లాడు. అయితే, గాల్లో ఎగురుతుండగా ఉన్నట్లుండి గాలి దిశ మారింది. అది కూడా వేగంగా గాలి వాళ్లిద్దరినీ మరోవైపు లాక్కెళ్లింది.
- Narender Thiru
- Published on- March 8, 2023 / 11:37 AM IST
Paragliding: టూరిజంలో అడ్వెంచర్ యాక్టివిటీస్‌లో పారాగ్లైడింగ్ ఒకటి. పారాషూట్ ద్వారా గ్లైడర్ ఎగురుతూ, మరో టూరిస్టును తనతోపాటు గాల్లోకి తీసుకెళ్లడమే పారాగ్లైడింగ్. ఒక్కరు లేదా ఇద్దరు పారాగ్లైడింగ్ చేయొచ్చు. నిజానికి ఇది ప్రమాదకరం కూడా. అయినా కొందరు ధైర్యంగా, ఇష్టంగా పారాగ్లైడింగ్ చేస్తుంటారు.
International Women’s Day: మహిళల గౌరవార్థం ప్రత్యేక డూడుల్ రూపొందించిన గూగుల్
అయితే, మంగళవారం కేరళలో పారాగ్లైడింగ్ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. కేరళలోని వర్కాల బీచ్‌లో తమిళనాడుకు చెందిన ఒక మహిళ పారాగ్లైడింగ్ చేసింది. ఆమెను ఒక ప్రొఫెషనల్ పారాగ్లైడర్ తనతోపాటు పారాషూట్ ద్వారా గాల్లోకి తీసుకెళ్లాడు. అయితే, గాల్లో ఎగురుతుండగా ఉన్నట్లుండి గాలి దిశ మారింది. అది కూడా వేగంగా గాలి వాళ్లిద్దరినీ మరోవైపు లాక్కెళ్లింది. దీంతో వెళ్లాల్సిన దిక్కు కాకుండా ఇంకో దిక్కుకు కదిలిపోయారు. చివరకు ఒక ఎత్తైన లైట్ పోల్‌కు చిక్కుకున్నారు. అంత ఎత్తులో అక్కడ అమర్చిన లైట్లకు వారి పారాషూట్ చిక్కుకుంది.
International Women’s Day: మహిళా దినోత్సవం సందర్భంగా బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఎక్కడంటే
దానికి సంబంధించిన తాళ్లతో వేలాడుతూ, వాళ్లు ఆ పోల్‌ను పట్టుకుని ఉండిపోయారు. దాదాపు యాభై అడుగుల ఎత్తులో పోల్‌కు చిక్కుకున్నారు. ప్రాణాలు అరచేత పట్టుకుని పోల్‌కు వేలాడుతూ ఉండిపోయారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. అయితే, వాళ్లు ఉన్నంత ఎత్తుకు సరిపడా నిచ్చెన వాళ్ల దగ్గర లేదు. దీంతో వారిని రక్షించడం కష్టమైంది. కానీ, ముందు జాగ్రత్తగా కింద వల, మ్యాట్రెస్ వంటివి ఏర్పాటు చేశారు.
అనేక రకాలుగా సహాయక చర్యలు కొనసాగించారు. తర్వాత ఆ పోల్ ఎత్తు తగ్గించారు. దీంతో వాళ్లు కూడా కాస్త కిందికి వచ్చారు. తర్వాత వారిని నిచ్చెన సహాయంతో సురక్షితంగా కిందికి దించారు. ఈ ఘటనలో వారికి స్వల్ప గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
