International Women’s Day: మహిళల గౌరవార్థం ప్రత్యేక డూడుల్ రూపొందించిన గూగుల్

మహిళల గౌరవార్థం గూగుల్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని మహిళల కోసం రూపొందించింది. ప్రతి అక్షరంలోని ఒక్కో చిత్రం మహిళల సేవా భావాన్ని, వారి ప్రగతిని తెలియజేస్తుంది. మహిళలు ఒకరికొకరు ఎలా సహకరించుకుంటున్నారు.. ఒకరి అభ్యున్నతికి ఇంకొకరు ఎలా కారణమవుతున్నారు అనే అంశాల్ని చిత్రించేలా ఈ డూడుల్ రూపొందింది.

International Women’s Day: మహిళల గౌరవార్థం ప్రత్యేక డూడుల్ రూపొందించిన గూగుల్

Updated On : March 8, 2023 / 11:06 AM IST

International Women’s Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సెర్చింజన్ ‘గూగుల్’ ప్రత్యేక ‘డూడుల్’ రూపొందించింది. మహిళల గౌరవార్థం గూగుల్ అనే పదంలోని ప్రతి అక్షరాన్ని మహిళల కోసం రూపొందించింది. ప్రతి అక్షరంలోని ఒక్కో చిత్రం మహిళల సేవా భావాన్ని, వారి ప్రగతిని తెలియజేస్తుంది.

International Women’s Day: మహిళా దినోత్సవం సందర్భంగా బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం.. ఎక్కడంటే

మహిళలు ఒకరికొకరు ఎలా సహకరించుకుంటున్నారు.. ఒకరి అభ్యున్నతికి ఇంకొకరు ఎలా కారణమవుతున్నారు అనే అంశాల్ని చిత్రించేలా ఈ డూడుల్ రూపొందింది. ఊదా రంగులో ఉన్న డూడుల్ ఆకట్టుకునేలా ఉంది. డూడుల్‌పై క్లిక్ చేస్తే, స్క్రీన్ పై నుంచి ఊదా రంగు కాగితాలు వర్షంలా కురుస్తున్నాయి. అలాగే ఊదా రంగు జెండాలు పట్టుకున్న నాలుగు చేతులు స్క్రీన్ కింది భాగంలో కదులుతూ వెళ్తున్నాయి. మహిళలకు ఓటు హక్కు కల్పించాలని కోరుతూ 1908లో ఊదా రంగు దుస్తులు ధరించారు. అందుకే ఈసారి ఊదా రంగు థీమ్ ఎంచుకున్నారు.

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. 9న ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశాలు

మానవ జీవితంలో మహిళలే కీలక సంరక్షకులుగా ఉంటారని, మాతృత్వంలో మహిళలు ఒకరితో ఒకరు తోడుగా ఉంటారని గూగుల్ పేర్కొంది. జీవితంలో పరస్పరం సహకరించుకుంటూ, ప్రగతికి కారణమవుతున్న మహిళల గౌరవార్థం ఈ డూడుల్ రూపొందించామని, మహిళలు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని గూగుల్ పేర్కొంది. తాజా డూడుల్‌ను అలిస్సా వినాన్స్ అనే మహిళా ఆర్టిస్ట్ డిజైన్ చేసింది. ఆమె డూడుల్స్ రూపొందించడంలో దిట్ట.