Harish Begera : చేయని తప్పుకు సౌదీలో జైలుశిక్ష.. 604 రోజుల తర్వాత ఇంటికి!

అతడో ఏసీ టెక్నీషియన్.. కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన వ్యక్తి.. అతడే.. చేయని తప్పుకు సౌదీలో 604 రోజులు జైలుశిక్ష అనుభవించాడు.

604 days in Saudi prison for a Facebook post : అతడో ఏసీ టెక్నీషియన్.. కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన వ్యక్తి.. అతడే.. Harish Begera (34) చేయని తప్పుకు సౌదీలో జైలుశిక్ష అనుభవించాడు. 604 రోజుల తర్వాత ఇప్పుడు స్వస్థలానికి తిరిగి వచ్చాడు. సౌదీలో క్రౌన్ ప్రిన్స్ ను అగౌరవపరుస్తూ సోషల్ కమ్యూనిటీలో పోస్టు పెట్టాడంటూ అప్పట్లో అతడికి జీవిత ఖైదు విధించారు. 19 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఈ కేసుపై దర్యాప్తు జరిపిన అనంతరం ఉడిపి పోలీసులు ఫేస్ బుక్ పోస్టు హరీష్ పెట్టలేదని తేల్చేశారు. ఉద్దేశపూర్వకంగానే ఎవరో అతడ్ని ఈ కేసులో ఇరికించి జైలు పాలు చేశారని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో డిసెంబర్ 22, 2019లో బెగెరా అరెస్ట్ అయ్యాడు. సౌదీలోని డామ్న్ నగరంలో పనిచేశాడు. భారత ప్రభుత్వ పౌర సవరణ చట్టానికి మద్దతుగా ఫేస్ బుక్ లో పోస్టు షేర్ చేశాడు. అనంతరం ఆ పోస్టుపై క్షమాపణలు తెలియజేస్తూ వీడియోను కూడా రిలీజ్ చేశాడు. ఆ తర్వాత తన ఫేస్ బుక్ అకౌంట్ డియాక్టివేట్ చేసినట్టు తెలిపాడు. కానీ, అతడి పేరుతో మరో ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ను అగౌరవపరిచేలా పోస్టులు పెట్టారు.
Gandhi Hospital : గాంధీ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ట్విస్ట్

ఫేస్ బుక్ అకౌంట్ అతడి పేరుతో ఉండటంతో హరీష్ ను సౌదీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో తన భర్తను అన్యాయంగా ఇరికించారంటూ అతడి భార్య సుమనా జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు గత ఏడాది అక్టోబర్ నెలలో దక్షిణ కన్నడ జిల్లాలోని మూడ్ బిద్రి టౌన్‌లో స్థానిక పోలీసులు Abdul Huyez, Abdul Thuyez ఇద్దరు సోదరులను అరెస్ట్ చేశారు. వీరిద్దరే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి బెగెరా పేరుతో పోస్టు పెట్టినట్టు దర్యాప్తులో తేలింది. అదేరోజున హరీష్ తన ఫేస్ బుక్ అకౌంట్ ప్రొఫైల్ డియాక్టివేట్ చేశాడు. బెగెరాపై కక్షతోనే CAA, NRCకు మద్దుతగా పోస్టును పెట్టినట్టు పోలీసులు విచారణలో తేల్చారు.
Afghan Dogs : ఛత్తీస్ గఢ్ అడవుల్లో అఫ్గాన్ యుద్ధ జాగిలాలు

దీనికి సంబంధించి చార్జ్ షీటును ఉడిపి జిల్లా పోలీసులు 10 రోజుల్లోనే సమర్పించారు. ఈ ఛార్జ్ షీటును సౌదీలోకి ట్రాన్స లేట్ చేసి MEA ద్వారా సౌదీ అధికారులకు షేర్ చేశారు. దాంతో సౌదీ అధికారులు బెగెరాను రిలీజ్ చేశారు. సౌదీ జైలు నుంచి విడుదలై బెంగళూరుకు చేరుకున్న బంగెరా 19 నెలల తర్వాత తన నాలుగేళ్ల కూతురిని చూసి కన్నీళ్లు ఆపుకోలేపోయాడు. ఒకరు చేసిన నేరానికి తనను ఒక ఉగ్రవాదిలా చూశారంటూ వాపోయాడు. తన కుటుంబం భయానక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపాడు. జైలుకు వెళ్లక ముందు రోజుకు మూడు నాలుగు సార్లు భార్య, పాపకు వీడియో కాల్ చేసే వాడినని, ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి మాట్లాడే వాడినని చెప్పాడు. కానీ, జైల్లో ఉన్నప్పుడు తనకు ఎప్పటికైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఉండేవాడినని, కానీ, 604 రోజుల తర్వాత తనకు జైలు జీవితం నుంచి విముక్తి కలిగిందని చెప్పుకొచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు