Afghan Dogs : ఛత్తీస్ గఢ్ అడవుల్లో అఫ్గాన్ యుద్ధ జాగిలాలు

అఫ్గానిస్థాన్ జాగిలాలు ఛత్తీస్ గఢ్ అడవుల్లో హల్ చల్ చేయనున్నాయి. అడవుల్లో మావోయిస్టులను ఏరివేయటానికి ఈ యుద్ధ జాగిలాలు రెడీగా ఉన్నాయి.

Afghan Dogs : ఛత్తీస్ గఢ్ అడవుల్లో అఫ్గాన్ యుద్ధ జాగిలాలు

Afghan Dogs For Maoist Operations Chhattisgarh Farest (1)

Afghan dogs for Maoist operations chhattisgarh farest : అఫ్గానిస్థాన్ జాగిలాలు ఛత్తీస్ గఢ్ అడవుల్లో హల్ చల్ చేయనున్నాయి. ఏంటీ అఫ్గానిస్థాన్ మొత్తం తాలిబన్ల చేతిలో చిక్కి సంక్షోభంలో కూరుకుపోతే అఫ్గాన్ జాగిలాలు భారత్ లోని ఛత్తీస్ గఢ్ అడువులకు వచ్చాయా? అక్కడకు అవి ఎలా వచ్చాయి? ఎందుకొచ్చాయి? అనే డౌట్ వచ్చే ఉంటుందిగా. ఎందుకంటే ఆప్గాన్ లో తాలిబన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. అక్కడ ప్రజలు..ముఖ్యంగా యువతులు,మహిళలు భవిష్యత్తు మాట ఎలా ఉన్నా వారి బ్రతుకులే భయం గుప్పిట్లో కొట్టుమిట్టాడుతున్నాయి. దేశాన్ని మొత్తం తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే భారత్- టిబెట్ సరిహద్దుల్లో పోలీస్ (ఐటీబీపీ) కమాండో దళంలో భాగంగా ఉండి. అఫ్గానిస్థాన్ సంక్షోభం కారణంగా ఆ దళంతో పాటు భారత్ కు మూడు యుద్ధ జాగిలాలుతిరిగి వచ్చాయి. ఈ జాగిలాలు మావోయిస్టుల స్థావాలైన ఛత్తీస్ గఢ్ అడవుల్లో హల్ చల్ చేయనున్నారు.మావోయిస్టులను ఏరివేయటానికి ఈ యుద్ధ జాగిలాలను చత్తీస్ గఢ్ అడవుల్లోకి పంపనున్నారు.

పరిరక్షక దళం చేపట్టిన మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాల్లో ఈ యుద్ధ జాగిలాలు అధికారులకు సహాయపడనున్నాయి. ఈ విషయాన్ని బుధవారం (ఆగస్టు 18,2021) అధికారులు తెలిపారు. మూడేళ్లపాటు అఫ్గాన్ లోని భారత ఎంబసీకి కాపలాగా ఉన్న ఈ యుద్ధ జాగిలాలు మంగళవారం గాజియాబాద్ ఎయిర్ బేస్ కు చేరాయి.

అవి ఎయిర్ బేస్ కు చేరగానే వాటిని ఢిల్లీకి నైరుతీ దిశగా ఉన్న చావలా ప్రాంతంలోని ఐటీబీసీ శిబిరానికి తరలించారు. వీటిని రూబి (బెల్జియన్ మెలినోయిస్ బ్రీడ్, ఆడకుక్క), మాయ (ల్యాబ్రోడార్ కు చెందిన ఆడకుక్క), బాబి అనే మగ డాబర్ మ్యాన్ కుక్క ఉన్నాయి.

మందుపాతరలను గుర్తించటంలో ఇవి దిట్ట. దీంతో అఫ్గాన్ సంక్షోభం అనంతరం వీటిని అక్కడ నుంచి ఢిల్లీకి తరలించారు.ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టుల్ని ఏరి వేయటానికి అధికారులు ఈ యుద్ధ జాగిలాలను ఉపయోగించనున్నారు.ఇప్పటికే మందుపాతరను గుర్తించటంలో ఈ యుద్ధ జాగిలాలు పలుమార్లు మన దౌత్య సిబ్బందితో పాటు అఫ్గాన్ పౌరులను ప్రాణాలు కూడా కాపాడాయి. అటువంటి ఈ జాగిలాలు ఇక ఛత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టుల పని పట్టటానికి రెడీగా ఉన్నాయి.