Slapped By Son: కొడుకు చెంపదెబ్బతో ప్రాణం కోల్పోయిన తల్లి.. సీసీటీవీ ఫుటేజి బయటపెట్టిన నిజం
తల్లీకొడుకుల మధ్య జరిగిన వాగ్వాదంలో 76ఏళ్ల తల్లిని చెంపదెబ్బ కొట్టాడు. ద్వారకాలో జరిగిన ఈ ఘటనలో తల్లి ప్రాణాలు కోల్పోయింది. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో సోమవారం మధ్యాహ్నం జరిగినట్లు ఈ ఘటన రికార్డు అయింది.

Slapped By Son
Slapped By Son: తల్లీకొడుకుల మధ్య జరిగిన వాగ్వాదంలో 76ఏళ్ల తల్లిని చెంపదెబ్బ కొట్టాడు. ద్వారకాలో జరిగిన ఈ ఘటనలో తల్లి ప్రాణాలు కోల్పోయింది. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో సోమవారం మధ్యాహ్నం జరిగినట్లు ఈ ఘటన రికార్డు అయింది. అవతార్ కౌర్ అనే మహిళ ముఖంపై కొడుకు గట్టిగా కొట్టడంతో స్పృహ కోల్పోయి కింద పడిపోయింది.
వీడియో ఆధారంగా 45ఏళ్ల కొడుకుపై సెక్షన్ 304ప్రకారం.. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయడంతో పాటు బిందాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటన జరగడానికి ముందు పక్కింటి వాళ్లు వాహనాలు పార్కింగ్ చేసే విషయంలో తల్లీకొడుకుల మధ్య వాదన జరిగినట్లు తెలుస్తోంది.
అలా వాదన జరుగుతుండటంతో పక్కింటి వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశారు. రంగప్రవేశం చేసే లోపే తల్లీపై చేయి చేసుకోవండం ఆమె స్పృహ కోల్పోయి పడిపోవడం జరిగింది. వాదన ఆపేయాలని తల్లి అడిగినప్పటికీ ఆమె కొడుకు వినిపించుకోకుండా ఆమెపై దాడికి పాల్పడ్డాడని దాంతో ఇద్దరి మధ్య వాదన జరిగిందని వాళ్లు చెప్పుకొచ్చారు.
మహిళను హాస్పిటల్ కు తరలించి.. డాక్టర్ ను సంప్రదించగా ప్రాణం పోయి చాలా సేపు అయినట్లు తేల్చి చెప్పారు. నిరుద్యోగిగా ఉన్న కొడుకు రణబీర్ పై కేసు నమోదు అయింది. ఢిల్లీ ఉమెన్ కమిషన్ విషయంపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.