Punjab: సీఎంను కలుసుకున్నాక మనసు మార్చుకున్న గవర్నర్.. అసెంబ్లీ సమావేశానికి గ్రీన్ సిగ్నల్
ముందుగా అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై ఆప్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా చండీగఢ్‌లో రెండు రోజుల క్రితం నిరసన చేపట్టారు. ‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేయొద్దు’, ‘ఆపరేషన్ లోటస్ ముర్దాబాద్’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.

After face off, Governor approves convening of Vidhan Sabha session on Sept 27
Punjab: సెప్టెంబర్ 27న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడానికి పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్వయంగా చండీగఢ్‌లోని రాజ్ భవన్‌ను వచ్చి గవర్నర్‌ను కలుసుకున్నాక. కాగా, ఇంతకు ముందు ఈ సమావేశాల నిర్వహణ ఉత్త్వర్వులను ఉపసంహరించుకున్న గవర్నర్.. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం ప్రత్యేక సమావేశానికి ఆమోదం తెలపడం గమనార్హం. ఈ విషయమై పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ మాట్లాడుతూ ‘‘మా వినతికి గవర్న్ ఆమోదం తెలిపారు. ఈ నెల 27న అసెంబ్లీ మూడవ సెషన్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు’’ అని పేర్కొన్నారు.
పంజాబ్‌లో భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ లోటస్ ప్రారంభించిందన్న ఆరోపణలతో ప్రభుత్వం బలపరీక్షకు వెళ్లేందుకు సిద్ధమైంది. దీని కోసమే ఈ నెల 22నే ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. అనంతరం సెప్టెంబర్ 27న నిర్వహించాలనే నూతన ప్రతిపాదనతో స్వయంగా ముఖ్యమంత్రే వెళ్లి గవర్నర్‌ను కలుసుకున్నారు. సీఎంతో పాటు స్పీకర్ సైతం వెళ్లారు. అనూహ్యంగా ఈసారి ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ ఆమోదం తెలిపారు.
కాగా, ముందుగా అసెంబ్లీ సమావేశానికి గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై ఆప్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా చండీగఢ్‌లో రెండు రోజుల క్రితం నిరసన చేపట్టారు. ‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేయొద్దు’, ‘ఆపరేషన్ లోటస్ ముర్దాబాద్’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు.
25 Crore Lottery: లాటరీ గెలిచాక ప్రశాంతత పోయింది.. నిద్ర కూడా పట్టడం లేదు.. కారణం వాళ్లే