జీవితంలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అదృష్టం ఏ రూపంలో అయినా వరించొచ్చు. రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోవచ్చు, నిరు పేద కోటీశ్వరుడు అవ్వొచ్చు. అందుకే.. ఏ నిమిషానికి ఏం
జీవితంలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. అదృష్టం ఏ రూపంలో అయినా వరించొచ్చు. రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోవచ్చు, నిరు పేద కోటీశ్వరుడు అవ్వొచ్చు. అందుకే.. ఏ నిమిషానికి ఏం జరుగునో..అని పెద్దలు ఊరికే అనలేదు. ఆ ఫుడ్ డెలివరీ బాయ్ విషయంలో ఇదే జరిగింది. ఓవర్ నైట్ లో అతడు పాపులర్ అయ్యాడు. నిరు పేద సెలబ్రిటీ అయిపోయాడు. ఇండియా మొత్తం అతడి గురించి డిస్కస్ చేసుకుంటోంది. ఒక చిరునవ్వు(smile) అతడి జీవితాన్ని మలుపుతిప్పింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఇండియా(zomato india).. డెలివరీ బాయ్ పిక్ ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ప్రొఫైల్ పిక్ గా పెట్టింది.
అతడి పేరు సోను. ఢిల్లీ నివాసి. జొమాటోలో డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. ఇటీవల విలాగర్ ఢిల్లీ డీసీ రైడర్(vlogger delhi dc rider).. సోనుపై ఓ వీడియో తీసింది. అందులో.. ఏం పని చేస్తావు, రోజుకి ఎన్ని గంటలు పని చేస్తావు, రోజుకి ఎంత సంపాదిస్తావు లాంటి ప్రశ్నలకు సోను సమాధానం ఇచ్చాడు. ఈ వీడియోలో అతడు చిరునవ్వు చిందిస్తూ ఉంటాడు. ఈ వీడియోని టిక్ టాక్ లో(tik tok) పెట్టింది వీలాగర్. అంతే.. ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో సోను ఇచ్చిన స్మైల్ నెటిజన్లను ఫిదా చేసింది. టిక్ టాక్ లో ఆ వీడియోని 47లక్షల మంది చూశారు. అలా అలా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది.
జొమాటో రైడర్ హ్యాష్ ట్యాగ్ తో(zomato rider) సోను వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. ఇది గమనించిన జొమాటో ఇండియా కంపెనీ.. వెంటనే తమ ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లలో ప్రొఫైల్ పిక్ ని మార్చేసింది. డెలివరీ బాయ్ సోను పిక్ ని ప్రొఫైల్ పిక్ గా పెట్టింది. నౌ ఏ హ్యాపీ రైడర్ ఫ్యాన్ అకౌంట్(now a happy rider fan account) అని ట్యాగ్ చేసింది.
Also Read | అదృష్టవంతుడు.. గూగుల్ పే లో రూ.3వేలు పంపితే రూ.లక్ష రివార్డ్ వచ్చింది
ఆ తర్వాత.. సోను ఫేస్ మీమ్స్ కు వేదికైంది. ప్రముఖ సినిమాలు, పాపులర్ ఫొటోల్లో నెటిజన్లు ముఖాలను మార్చేశారు. అక్కడ సోను పిక్ ని తగిలించేశారు. ఇలా ఓవర్ నైట్ లో డెలివరీ బాయ్ కాస్త సెలబ్రిటీ అయ్యాడు. ఓ చిరునవ్వు అతడి జీవితాన్ని మలుపుతిప్పింది.
this is now a happy rider fan account
— Zomato India (@ZomatoIN) February 28, 2020
Learn to be happy with what you have. ❤️✌️? pic.twitter.com/XnUZi7np6a
— Shashwat ?️ (@_Shakti_maan) February 27, 2020