Covid
Covid Review: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పరిస్థితులపై ప్రాంతీయ అధికారులు సమీక్షలు చేపట్టాలని జాతీయ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు. ఈమేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యారోగ్యశాఖలకు రాజేష్ భూషణ్ ఓ లేఖ రాశారు. “దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నిరంతరం క్షీణిస్తున్న ధోరణిని చూపుతున్నందున.. ఆయా రాష్ట్రాల్లో విధించిన COVID 19 అదనపు పరిమితులను సమీక్షించి, సవరించాలని” లేఖలో పేర్కొన్నారు.
Also read: AP Covid : ఏపీలో కరోనా.. ఊపిరిపీల్చుకుంటున్న జనాలు, కొత్తగా ఎన్ని కేసులంటే
ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో గత నెల రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్యలో హెచ్చుతగ్గులు కనిపించాయి. దీంతో కొన్ని రాష్ట్రాలు తమ సరిహద్దులు మూసివేయడంతో పాటు ప్రజలకు ఆంక్షలు విధించాయి. అయితే, మూడో దశను సమర్ధ వంతంగా ఎదుర్కోవడంతో పాటు, ప్రస్తుతం కేసుల సంఖ్య సరాసరి కంటే తక్కువగా నమోదు కావడంతో.. విధించిన ఆంక్షలను సమీక్షించాలని కేంద్రం కోరింది. ఆంక్షలు కొనసాగించడం వలన.. ప్రజలకు, ఆర్ధిక వ్యవస్థకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని గ్రహించిన కేంద్రం.. ఈమేరకు ఆంక్షలు సడలించి ప్రజలకు భరోసా కల్పించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
ప్రపంచవ్యాప్తంగానూ, దేశంలోనూ మహమ్మారి వ్యాప్తి తగ్గుతున్నందున ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలను సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. తదనుగుణంగా అంతర్జాతీయ ప్రయాణికులకు మార్గదర్శకాలను సవరించింది. ఆంక్షలు సడలించినప్పటికీ.. రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతిరోజూ కరోనా వ్యాప్తిని పర్యవేక్షించడం కొనసాగించాలని రాజేష్ భూషణ్ సూచించారు. అందుకు సంబంధించి “టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్ అనే ఐదు దశల వ్యూహాన్ని కూడా ఆయా రాష్ట్రాల అధికారులతో పంచుకున్నారు.
Union Health Secretary Rajesh Bhushan writes to all States/UTs, asks them to review and amend or end additional COVID19 restrictions as the pandemic in the country shows a sustained declining trend pic.twitter.com/7iTlZ8tF4q
— ANI (@ANI) February 16, 2022
Also read: Delhi Covid Curb : ఢిల్లీలో కరోనా తగ్గుముఖం.. త్వరలో ఆంక్షలన్నీ ఎత్తివేసే ఛాన్స్..!