కుటుంబంతో మిచెల్ 15 నిమిషాలు మాట్లాడుకోవచ్చు

  • Published By: veegamteam ,Published On : January 14, 2019 / 11:53 AM IST
కుటుంబంతో మిచెల్ 15 నిమిషాలు మాట్లాడుకోవచ్చు

Updated On : January 14, 2019 / 11:53 AM IST

అగస్టా  వెస్ట్ లాంగడ్ కేసులో మధ్యవర్తి మిచెల్ కు వారంలో ఒకరోజు 15 నిమిషాలు తన కుటుంబంతో, లాయర్లతో  మాట్లాడేందుకు సోమవారం(జనవరి14,2019) సీబీఐ స్పెషల్ కోర్టు అనుమతిచ్చింది. కుటుంబం, స్నేహితులు, లాయర్లతో మాట్లాడేందుకు ఇంటర్నేషనల్ కాల్స్ చేసుకొనేందుకు అవకాశం ఇవ్వాలని మిచెల్ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అతడికి వారంలో ఒకసారి 15 నిమిషాలు కుటుంబం,. లాయర్లతో మాట్లాడుకొనేందుకు అంగీకరించింది.
అగస్టా వెస్ట్ లాండ్ వీవీఐపీ చాపర్ డీల్ లో మధ్యవర్తిగా ఉన్న మిచెల్ గతేడాది జులైలో దుబాయ్ లో అరెస్ట్ అయ్యాడు. గతేడాది డిసెంబర్ 4న మిచెల్ ను ప్రత్యేక విమానంలో భారత్ కి తీసుకొచ్చారు.మొదట మిచెల్ ను కోర్టు సీబీఐ కస్టడీకి పంపింది. తీహార్ జైల్లో ఉంచి అతడిని సీబీఐ అధికారులు విచారించారు. ఆ తర్వాత సీబీఐ నుంచిఈడీ తన ఆధీనంలోకి తీసుకోని విచారిస్తోంది.ఫిబ్రవరి 26వరకు అతడిని విచారణ నిమిత్తం ఈడీ కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది.