అమృతాన్నిఇచ్చే అమ్మలూ హ్యాట్సాఫ్ : 90 లీటర్ల తల్లిపాలు దానం

  • Publish Date - December 27, 2019 / 07:44 AM IST

 

పుట్టిన బిడ్డకు అమ్మపాలు అమృతంతో సమానం. భారతదేశంలో ప్రతీ ఏటా ఏడు లక్షలకు పైగా శిశు మరణలు సంభవిస్తున్నాయి.  ప్రతీ వెయ్యి శిశు మరణాల్లోను 29 శాతం శిశువులు తక్కువ బరువుతో పుట్టటం వల్లే చనిపోతున్నారు. ఇటువంటివారికి తల్లిపాలు సమృద్ధి లభించకపోవటం వల్లనే జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. 

అటువంటి బిడ్డల కోసం తల్లిపాలను విరాళంగా ఇస్తున్నారు అహ్మదాబాద్ లోని ఎంతోమంది తల్లులు. తల్లిపాలు లేక..లభించక బరువు తక్కువగా ఉన్న శిశువులు ‘‘అర్పాన్ నవజాత సంరక్షణ కేంద్రం తల్లిపాల బ్యాంకు’’ను స్థాపించింది. ఈ బ్యాంకుకు 250 మంది తల్లులు 90 లీటర్ల తల్లిపాలు విరాళంగా ఇచ్చారు. ఆ పాలు ఎంతోమంది నవజాత శిశులు ప్రాణాలు కాపాడింది. 

ఈ తల్లిపాల బ్యాంకుకు డాక్టర్ రోషినా మార్ఫాటియా అనే 29 ఏళ్ల మహిళ ఇప్పటి వరకూ 12 లీటర్ల పాలను విరాళంగా ఇచ్చారు. తల్లిపాలు లభించక ఐసీయూలో  చికిత్స పొందుతున్న శిశువులకు ఆమె ఇచ్చిన పాలు అమృతంలా పనిచేశాయి. ఆ బిడ్డల ప్రాణాలు కాపాడాయి. పేదరికం వల్ల రక్త హీనతతో బాధపడుతున్న తల్లులు తమ బిడ్డలకు పాలు ఇవ్వలేకపోతున్నారు. దీంతో వారికి పుట్టిన బిడ్డలకు తల్లిపాలు లేక తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. తల్లిపాలు లభించకపోవటంతో చాలా సందర్భాలలో ఆ శిశువులు మృతి చెందుతున్నారు. 

అటువంటి శిశువుల కోసం సెప్టెంబర్ 20న మగబిడ్డకు జన్మనించిన రుషియా తన బిడ్డకు సరిపడా పాలు ఇస్తూనే..తల్లిపాలు అవసరమైన నవజాత శిశువుల కోసం 12 లీటర్ల పాలను విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా రుషియా మాట్లాడుతూ..నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను..కాబట్టి నాబిడ్డకు సరిపడానే కాకుండా తనవద్ద పాలు సమృద్దిగా ఉన్నాయి..ఆ పాలను తల్లిపాలు అవసరమైన శిశుల కోసం ఇవ్వాలని అనుకున్నారు. ఏ బిడ్డ పాలు లేకుండా చనిపోకూడదు..ఇది చాలా దురదృష్టకరం అందుకే అటువంటి బిడ్డల కోసం తన తల్లిపాలను ఇస్తున్నాననీ..అలా ఇవ్వటం నాకు చాలా చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 

తల్లిపాలు బిడ్డలకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయని నవజాత శిశువులకు తల్లిపాలు అమృతంతో సమానమని ఆమె అన్నారు. ఇలా ఈ తల్లిపాల బ్యాంకుకు తమ పాలు ఇస్తున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. తమ బిడ్డలతో పాటు ఎంతోమంది బిడ్డలకు తమ చనుబాలను ఇచ్చి ప్రాణాలను కాపాడుతున్నారు ఎంతోమంది తల్లులు. ఎంతైనా అమ్మ మనస్సు అమ్మ మనస్సే.