చౌకీ దార్ చోర్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పానని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. రాఫెల్ వ్యవహారం కోర్టులో ఉన్నందునే క్షమాపణలు చెప్పానని తెలిపారు. మోడీ పాలనలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని విమర్శించారు. అవినీతిపై చర్చించేందుకు ప్రధానికి సమయం లేదని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు. ఆర్మీ అందరిదని.. కేవలం ప్రధానికి చెందినది కాదన్నారు. యూపీఏ హయాంలో ఆరుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని గుర్తు తెచ్చారు రాహుల్.