వ్యాక్సిన్ తీసుకున్న ఎయిమ్స్ డైరక్టర్,సీరం సీఈవో

AIIMS Director వేయికళ్లతో ఎదురుచూసిన కరోనా వ్యాక్సిన్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఇవాళ దేశ‌వ్యాప్తంగా క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్రారంభ‌మైంది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌గానే పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బందితోపాటు ఎయిమ్స్‌ డైరెక్ట‌ర్ ర‌ణ‌దీప్ గులేరియా, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అద‌ర్ పూనావాలా కూడా టీకాలు తీసుకున్నారు.

ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో… ఎయిమ్స్ డైరెక్ట‌ర్ గులేరియా కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.టీకా వేయించుకోవడం ద్వారా ఆయన టీకాపై ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగించారు. ఈ టీకాలు వేసే ప్రక్రియ కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్థన్ సమక్షంలో జరిగింది. ఇక, సీర‌మ్ సీఈవో పూనావాలా త‌న సంస్థ‌లోనే టీకా తీసుకున్నారు. కాగా, కొవిషీల్డ్ టీకాను సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్‌లోనే ఉత్ప‌త్తి చేసిన విషయం తెలిసిందే.

ఇక,వ్యాక్సిన్ ల విషయంలో ఎలాంటి వదంతులు, పుకార్లు నమ్మవద్దని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు సూచించారు. మన పరిస్థితులకు అనుగుణంగానే..వ్యాక్సిన్ లు తయారయ్యాయని తెలిపారు. తక్కువ సమయంలోనే రెండు మేడిన్ వ్యాక్సిన్లు వచ్చాయన్నారు. దేశీయ వ్యాక్సిన్లతో మన సత్తా ప్రపంచానికి తెలిసిందని చెప్పిన మోడీ..అంతా ఒకే సంకల్పంతో ఎలా పనిచేస్తారో భారత్ చూపించిందన్నారు.

ట్రెండింగ్ వార్తలు