Air India
Ants Found In Business Class : విమానం ఎగరడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణీకులు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. పైలట్ టేకాఫ్ కోసం ఎదురు చూస్తున్నాడు. బిజినెస్ క్లాస్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఏమైందోనని తెలుసుకొనేందుకు విమాన సిబ్బంది వచ్చారు. అందులో ఉన్న వారందరూ డబ్బున్న మారాజులు. జరిగిన విషయం తెలుసుకుని…వారికి క్షమాపణ చెప్పారు. వేరే విమానంలో పంపిస్తామని చెప్పి…సర్దిచెప్పారు.
Read More : KCR met Nitin Gadkari : నితిన్ గడ్కరీతో భేటీ అయిన సీఎం కేసీఆర్
ఇంతకు బిజినెస్ క్లాసులో ఏమైంది ?
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లండన్ వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం రెడీగా ఉంది. బిజినెస్ క్లాసులో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్ గెల్ వాంగ్ చక్ కూడా ఉన్నారు. అయితే…చీమల గుంపు కనిపించింది. దీంతో కొంతమంది అరిచారు. అక్కడకు చేరుకున్న విమాన సిబ్బంది ప్రయాణీకులను క్షమాపణలు చెప్పారు.
Read More : Telangana : ఇంటర్ విద్యా సంవత్సరం ఖరారు, పరీక్షల తేదీలు
మరో విమానాన్ని అరెంజ్ చేశారు. ఆ విమానంలో ఉన్న సామాను…మార్చడానికి నాలుగైదు గంటల సమయం పట్టిందంట. గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. జులై నెలలో సౌదీ అరేబియా వెళుతున్న ఎయిరిండియా విమానం విండ్ షీల్డ్ లో పగుళ్లు కనిపించాయి. వెంటనే కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
London bound Air India (AI-111) flight aborted take-off at Delhi airport after swarm of ants found in business class. Prince of Bhutan was on board. Later Air India changed the aircraft.
— ANI (@ANI) September 6, 2021