Air pollution in Delhi
Delhi Air Pollution : ఢిల్లీ ఎన్సీఆర్ లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై ఢిల్లీలో సగటున మూడు వందల పాయింట్లకు పైగా గాలి నాణ్యత నమోదు అయింది. సగటున ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 322 పాయింట్లుగా ఉంది. ఢిల్లీ యూనివర్సిటీ 354, లోధి రోడ్ 311, గురు గ్రామ్ 314, నోయిడాలో 324 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత నమోదు అయింది.
వాయు కాలుష్యంతో కళ్లలో మంట, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస కోస సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య నివారణ కోసం ఢిల్లీ ప్రభుత్వం 15 పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది. రెడ్ లైట్ ఆన్ వెహికల్ ఆఫ్, రోడ్లపై నీటిని చల్లడం, బయోమాస్ కలవకుండా చూడటం సహా కాలుష్య నియంత్రణ చర్యలను ఢిల్లీ ప్రభుత్వం చేపట్టింది.
Delhi : ఢిల్లీని కమ్మేసిన దుమ్ము, ధూళి.. భారీగా పెరిగిన వాయు కాలుష్యం
కాగా, కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణకి సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆప్ విమర్శలు చేస్తోంది. యూపీ, హర్యానా, రాజస్థాన్ నుంచి వచ్చే వాహనాలు పంట వ్యర్ధాల దహనంతో కలుష్య తీవ్రత పెరిగుతుందని ఆప్ అంటుంతోంది.