అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఉంచే బోర్డులో తప్పుంది అంటూ ఓ ఫొటో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పాత ఫొటోనే అయినా ప్రముఖ హిందీ టీవీ నటి, బాలీవుడ్ హీరోయిన్ షబానా అజ్మీ ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్ ద్వారా పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. 2015వ సంవత్సరంలో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో క్లిక్ అనిపించిన పిక్ సెన్సేషన్ గా మారింది.
ఆ ఫొటోల కార్పెట్ మీద తినడం నిషేదం అని రాయబోయి కార్పెట్ తినడం నిషేదించడమైనది అని రాసి ఉంది. ఆ పిక్ వైరల్ గా మారుతుండటంతో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పందించింది. ‘2015నుంచి ఇది ముఖ్యమైన అనౌన్స్‌మెంట్. మార్ఫింగ్ చేసిన ఇమేజ్ అప్పటి నుంచి చక్కర్లు కొడుతోంది. నిజం తెలియకుండా ఎటువంటి ఫొటోలను సర్క్యూలేట్ చేయకండి’ అంటూ ట్వీట్ ద్వారా మరోసారి వెల్లడించింది.
అయితే షబానా అజ్మీ లాంటి సెలబ్రిటీ షేర్ చేయడంతో చక్కటి స్పందన వస్తోంది. అసలు ఆ బోర్డు మీద హిందీ.. ఇంగ్లీషులో ఉంది. ఫర్ష్ పర్ ఖానా సక్త్ మనా హై అని హిందీలో ఉన్న వ్యాక్యానికి ఇంగ్లీషులో ఈటింగ్ కార్పెట్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని రాశారు. కేవలం ఆన్ అనే పదం మిస్ అవడం వల్ల అర్థం మారిపోయిందంటూ, అధికారులు పట్టించుకోవడం లేదని కామెంట్లు చేస్తున్నారు.
Important Announcement from #AAI Since 2015, this morphed image shown has been doing rounds time and again. Requesting everyone not to circulate any such photographs without proper fact-checking. pic.twitter.com/TCvvqW250o
— Airports Authority of India (@AAI_Official) November 1, 2019