Akhilesh Yadav: ‘బీజేపీ అధికారంలోకి వచ్చాకే పర్యావరణం మరింత పాడైంది’

Akhilesh Yadav: బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఉత్తరప్రదేశ్ లో పర్యావరణం పాడైందని సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శనివారం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మొక్కలు నాటే కార్యక్రమం గురించి మాట్లాడిన ఆయన బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఇలా జరుగుతుందని అన్నారు.

వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా అఖిలేశ్ యూపీ గవర్నెంట్ ను తిట్టిపోశారు. ఉత్తరప్రదేశ్ లో ఏటా మొక్కల నాటే ప్రక్రియపై బీజేపీ ప్రచారం చేస్తూనే ఉంది. కానీ, ఇప్పటివరకూ ఎన్ని మొక్కలు నాటారో వెల్లడించాలి. ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయో తెలియజేయాలి. నిజానికి పర్యావరణం కూడా బీజేపీ అధికారంలోకి వచ్చాకే ఇబ్బందులు పడుతుంది’ అని సమాజ్ వాదీ నేత అన్నారు.

గత ప్రభుత్వంలో సమాజ్ వాదీ పార్టీ తీసుకున్న నిర్ణయాలే దృఢమైన దిశలో అడుగులు వేశాయి. అతని పదవి కాలంలో గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ గురించి ప్రస్తావిస్తూ.. గ్రీన్ పార్కులు తవ్వేసి ఇప్పుడు దారుణంగా తయారుచేశారని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు