China H9N2 outbreak
Alert : చైనా దేశంలోని పిల్లల్లో హెచ్9ఎన్2 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేరళ ఆరోగ్యశాఖ అదికారులు అప్రమత్తమయ్యారు. చైనాలోని పిల్లలకు ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ కేసులు, శ్వాసకోశ వ్యాధులు వస్తున్న దృష్ట్యా కేరళలోని వైద్యనిపుణులతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పిల్లల్లో కనిపించే న్యుమోనియాకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పరిస్థితిని విశ్లేషించేందుకు తాము వైద్యాధికారులతో సమావేశమయ్యానని మంత్రి వీణా జార్జ్ చెప్పారు.
ALSO READ : Marri Rajashekar Reddy : మైనంపల్లిపై మర్రి రాజశేఖర్ రెడ్డి ఫైర్
చైనాలో కొవిడ్ వ్యాప్తి సందర్భంగా ఎక్కువ కాలం లాక్ డౌన్ విధించారు. కొవిడ్ మహమ్మారి కారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిందని, అందువల్లే హెచ్9ఎన్2 మహమ్మారి ప్రబలుతోందని మంత్రి పేర్కొన్నారు. చైనాలోని పిల్లలకు హెచ్9ఎన్2 మహమ్మారి ప్రబలుతున్న దృష్ట్యా తాము అప్రమత్తంగా ఉన్నామని మంత్రి చెప్పారు. చైనాలోని ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా తెలిపింది.
ALSO READ : KTR : మంత్రి కేటీఆర్ కు ఈసీ నోటీసులు
చైనాలో వ్యాప్తి చెందుతున్న ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కేసులు, శ్వాసకోశ వ్యాధుల వల్ల భారతదేశానికి తక్కువ ప్రమాదం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల నుండి బయటపడే ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.