Alien Spot Jharkhand : నడిరోడ్డుపై ఏలియన్.. ఎలా నడుస్తుందో చూడండి.. నిజమెంత?

అది నిజంగా గ్రహాంతరవాసేనా? ఏలియన్ నిజంగా నడిరోడ్డుపై నడిచివెళ్తుందా? ఇంతకీ అదేంటి? జార్ఖండ్‌లోని హజారిబాగ్‌లో కనిపించిన ఆ గ్రహాంతరవాసి ఎక్కడి నుంచి వచ్చింది?

Alien Spot Jharkhand Road : అది నిజంగా గ్రహాంతరవాసేనా? ఏలియన్ నిజంగా నడిరోడ్డుపై నడిచివెళ్తుందా? ఇంతకీ అదేంటి? జార్ఖండ్‌లోని హజారిబాగ్‌లో కనిపించిన ఆ గ్రహాంతరవాసి ఎక్కడి నుంచి వచ్చింది? చీకటిలో కనిపించిన ఆ ఏలియన్ రూపంలో ఉన్న ఆకృతికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో వెనుక అసలు నిజం బయటపడింది. ఓ నివేదిక ప్రకారం, వీడియో చేసిన వ్యక్తి చూసిన ఆకృతి.. ఒక మహిళగా గుర్తించారు. అది గ్రహాంతర జీవి కాదని ధృవీకరించారు.

జంషెడ్‌పూర్ నివాసి దీపక్ హెన్‌బ్రోమ్ ఈ వైరల్ వీడియోను రూపొందించినట్టు వెల్లడించాడు. ఆ వీడియోలో కనిపించేది గ్రహాంతరవాసి కాదని ఆయన ఖండించారు. తన ఆరుగురు స్నేహితులతో పాటు చక్రధర్పూర్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు మార్గంలో ఒక మహిళను నగ్న స్థితిలో చూశానని చెప్పాడు. మొదట్లో ఆ ఆకారాన్ని చూసి భయపడ్డాడు.

కానీ, ఆ తరువాత తన స్నేహితులతో కలిసి వీడియో చేశాడు. హజారిబాగ్‌లో గ్రహాంతరవాసులు ఉన్నారనే ప్రచారం పూర్తిగా తప్పు అన్నారు. దీని పూర్తి వీడియో తన వద్ద ఉందని పేర్కొన్నారు. ఈ వీడియోలో చూసిన మహిళ ఒక గ్రామ నివాసి.. రాత్రిపూట మంత్ర పూజలు చేసేందుకు ఆమె ఇలా నగ్నంగా వచ్చినట్టు తెలిపారు.

సోషల్ మీడియాలో 30 సెకన్ల క్లిప్‌ మాత్రమే ఉందని, పూర్తి వీడియో తన దగ్గర ఉందని తెలిపాడు. 30 సెకన్ల వైరల్ వీడియోలో.. చీకటిలో వీధిలో నడుస్తోంది ఓ ఏలియన్ ఆకారం.. అక్కడ బైక్‌లు ఆపడం చూడవచ్చు. మరికొందరు బైకర్లు ఆకృతిని చూసి భయపడ్డారు. మరొకరు వీడియోను రికార్డ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు