Manipur : కల్లోల మణిపూర్‌లో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం

కల్లోల మణిపూర్‌లో శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. మణిపూర్‌లో అన్ని రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను శుక్రవారం నుంచి పునఃప్రారంభించాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది....

schools reopen

Manipur : కల్లోల మణిపూర్‌లో శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. మణిపూర్‌లో అన్ని రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను శుక్రవారం నుంచి పునఃప్రారంభించాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ రాజధాని నగరం ఇంఫాల్‌లో తాజా నిరసనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 27నుంచి సెప్టెంబర్ 29 తేదీ వరకు రాష్ట్రంలోని పాఠశాలలను మూసివేయాలని గతంలో సర్కారు ఆదేశించింది.

Also Read :  Drone Attack : సిరియన్ మిలిటరీ అకాడమీపై డ్రోన్ దాడి…100 మందికి పైగా మృతి, 125 మందికి గాయాలు

మే 3వతేదీన ఈశాన్య రాష్ట్రంలో జాతి ఘర్షణలు చెలరేగడంతో మణిపూర్‌లో పాఠశాలలు మూసివేశారు. హింసాకాండ కారణంగా కొన్ని నెలల పాటు మూతపడిన పాఠశాలలు జూలైలో మణిపూర్ అంతటా తిరిగి తెరిచారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో గురువారం తాజాగా హింస చెలరేగింది. అక్కడ ఆందోళనకారులు రెండు ఇళ్లకు నిప్పు పెట్టారు. పలు రౌండ్ల బుల్లెట్లు కాల్చారు. మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగినప్పటి నుంచి 175 మందికి పైగా మరణించారు.

Also Read : Nara Lokesh : ఢిల్లీ నుంచి అమరావతి చేరుకున్న నారా లోకేశ్.. రేపు చంద్రబాబుతో ములాఖత్

ఈ ఘర్షణల్లో వందల మంది గాయపడ్డారు. షెడ్యూల్డ్ తెగ హోదా కోసం మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా కొండ ప్రాంతాల్లో ఆదివాసి సంఘీభావ యాత్ర నిర్వహించారు. మణిపూర్ జనాభాలో మెయిటీలు 53 శాతం ఉన్నారు. వీరు ఎక్కువగా ఇంఫాల్ లోయలో నివసిస్తున్నారు. నాగాలు, కుకీలతో సహా గిరిజనులు 40 శాతం ఉన్నారు. వీరంతా ఎక్కువగా కొండ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.