Nara Lokesh : ఢిల్లీ నుంచి అమరావతి చేరుకున్న నారా లోకేశ్.. రేపు చంద్రబాబుతో ములాఖత్
ఢిల్లీలో న్యాయవాదులతో నిరంతర సంప్రదింపులు జరిపారు. జాతీయ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. Nara Lokesh

Nara Lokesh Reaches Amaravati
Nara Lokesh – Chandrababu Arrest : నారా లోకేశ్ ఏపీకి చేరుకున్నారు. కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న లోకేశ్ ఇవాళ(అక్టోబర్ 5) అమరావతి వచ్చారు. లోకేశ్ కు స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు చేరుకున్నాయి. అయితే, జాతీయ రహదారి వద్దే టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు వాహనాలను రోడ్డు మీదే వదిలి కాలినడకన ఎయిర్ పోర్టు వద్దకు వెళ్లి లోకేశ్ కు ఘన స్వాగతం పలికారు. టీడీపీ అభిమానుల తాకిడితో విమానాశ్రయం టెర్మినల్ కిక్కిరిసిపోయింది. కార్యకర్తల నినాదాలతో మార్మోగిపోయింది.
గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి లోకేశ్ బయలుదేరారు. రేపు(అక్టోబర్ 6) ఉదయం నారా లోకేశ్ రాజమండ్రి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు లోకేశ్.
Also Read..Pawan Kalyan: సైకిల్-గ్లాసు కాంబినేషన్‌పై కొత్త స్లోగన్.. బీజేపీపై పవన్ వైఖరి మారిందా?
చంద్రబాబు అరెస్ట్ తర్వాత నారా లోకేశ్ గత నెల 14న రాజమండ్రి నుంచి ఢిల్లీకి వెళ్లారు. కొన్ని రోజుల పాటు అక్కడే మకాం వేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో రాష్ట్రపతిని కలిసి జగన్ సర్కార్ పై ఫిర్యాదు చేశారు. వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. న్యాయవాదులతో నిరంతర సంప్రదింపులు జరిపారు. జాతీయ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. 21 రోజుల తర్వాత ఢిల్లీ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చారు లోకేశ్.
Also Read..Janasena: చిత్తూరు జిల్లాలో మూడు సీట్లపై జనసేన గురి.. డైలమాలో టీడీపీ నేతలు!