Allahabad High Court: భర్తపై తప్పుడు రేప్ కేసు.. భార్యకు పదివేల ఫైన్

భర్తపై తప్పుడు రేప్ కేసు పెట్టిన భార్యకు పదివేల రూపాయల ఫైన్ విధించింది అలహాబాద్ కోర్టు. చట్టాన్ని, న్యాయాన్ని దుర్వినియోగం చేయకూడదని, దీనివల్ల కోర్టు సమయం వృథా అవుతుందని పేర్కొంది.

Allahabad High Court: భర్తపై తప్పుడు రేప్ కేసు పెట్టిన భార్యకు పదివేల రూపాయల ఫైన్ విధించింది అలహాబాద్ కోర్టు. చట్టాన్ని, న్యాయాన్ని దుర్వినియోగం చేయకూడదని, దీనివల్ల కోర్టు సమయం వృథా అవుతుందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఒక మహిళ, తన భర్తపై రేప్ కేసు నమోదు చేసింది. పెళ్లికిముందే తన భర్త మొహమ్మద్ సల్మాన్ రేప్ చేశాడని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. దీన్ని సవాలు చేస్తూ సల్మాన్ కోర్టులో కేసు దాఖలు చేశాడు. ఆమె ఆరోపణలు తప్పని చెప్పాడు. దీనిపై జస్టిస్ అంజనీ కుమార్ మిశ్రా, జస్టిస్ దీపక్ వర్మతో కూడిన బెంచ్ విచారణ జరిపింది.

delhi high court: ఫలించిన తెలంగాణ దంపతుల పోరాటం.. కుమార్తెను కలిసేందుకు అనుమతి

ఈ విచారణలో భార్య ఆరోపణలు తప్పని తేలింది. భార్య చేసిన ఆరోపణల ప్రకారం.. పెళ్లికిముందే సల్మాన్ తనతో శారీరక సంబంధం కలిగి ఉన్నాడని, ముందుగా పెళ్లికి నిరాకరించినా, తర్వాత పెళ్లి చేసుకున్నాడని పేర్కొంది. అయితే, తర్వాత జరిగిన విచారణలో ఆమె ఇదంతా అబద్ధమని చెప్పింది. పెళ్లికి ముందు ఇద్దరిమధ్యా ఎలాంటి శారీరక సంబంధం లేదని అంగీకరించింది. కొంతమంది తమ దంపతుల మధ్య గొడవ పెట్టేందుకు ప్రయత్నించారని, వాళ్ల తప్పుడు మాటలు విని భర్తపై కేసు పెట్టానని తెలిపింది. దీంతో సల్మాన్ ఏ తప్పూ చేయలేదని కోర్టు గుర్తించింది. అతడిపై పెట్టిన కేసు కొట్టివేసింది. భర్తపై తప్పుడు కేసు పెట్టి, కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు భార్యకు పదివేల రూపాయల జరిమానా విధించింది.

ట్రెండింగ్ వార్తలు