జ్ఞానవాపి మసీదులో హిందువుల పూజల నిర్వహణపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో హిందువుల పూజల నిర్వహణపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Gyanvapi

Gyanvapi Case Verdict : ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదులో హిందువుల పూజల నిర్వహణపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ ప్రార్థనా మందిరం సెల్లార్లో పూజలు చేసుకునేందుకు హిందువులను అనుమతించేలా వారణాసి జిల్లా న్యాయస్థానం ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ అంజుమన్ మసీదు కమిటీ హైకోర్టులో పిటీషన్ ను దాఖలు చేసింది. సోమవారం అలహాబాద్ హైకోర్టు జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ సింగిల్ బెంచ్ అంజుమన్ మసీదు పిటీషన్ తిరస్కరిస్తూ.. దిగువ కోర్టు తీర్పును సమర్ధించారు.

Also Read : Mohan Babu : అలాంటి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించిన మోహన్ బాబు..

జ్ఞానవాపీ మసీదులో దక్షిణ సెల్లార్ లో ఉన్నదేవతా మూర్తుల విగ్రహాలకు పూజలు చేసుకోవచ్చని జనవరి 31వ తేదీన వారణాసి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ తీర్పును అలహాబాద్ కోర్టు సమర్ధిస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటీషన్ ను తిరస్కరించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జ్ఞానవాపీ మసీదులో 1993 ముందు కూడా మసీదు సెల్లార్లో పూజలు నిర్వహించేశారు. మసీద్ కమిటీ ఆ సెల్లార్ ను వ్యాస్ కుటుంబం మసీద్ కు అప్పగించింది. ఆ తరువాత దాన్ని మేము స్టోర్ రూంగా వినియోగిస్తున్నామని, అక్కడ పూజలు నిర్వహించడం మాకు అభ్యంతరకరమని కోర్టు దృష్టికి పిటీషన్ తరుపు వాదనలు వినిపించారు. దీనిపై నాలుగు రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన తరువాత ఫిబ్రవరి 15న ఈ కేసుకు సంబంధించిన తీర్పును హైకోర్టు రిజర్వే చేసింది. తాజాగా సోమవారం వారణాసి జిల్లా కోర్టు తీర్పును సమర్ధిస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ పిటీషన్ ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది.

 

 

ట్రెండింగ్ వార్తలు