Mohan Babu : అలాంటి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించిన మోహన్ బాబు..

ఇటీవల పలువురు రాజకీయ నాయకులు, కొంతమంది తన పేరుని రాజకీయంగా వాడుకుంటున్నారని, అలాంటి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ మోహన్ బాబు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

Mohan Babu : అలాంటి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించిన మోహన్ బాబు..

Mohan Babu Releasing a Serious Press Note Regarding Politics

Updated On : February 26, 2024 / 12:13 PM IST

Mohan Babu : నటుడు మోహన్ బాబు ఎన్నో వందల సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి కలెక్షన్ కింగ్ గా స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. గతంలో మోహన్ బాబు రాజకీయాల్లో కూడా కొన్ని రోజులు యాక్టివ్ గా ఉన్నారు. ఇప్పుడు రాజకీయాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. అయితే ఇటీవల పలువురు రాజకీయ నాయకులు, కొంతమంది తన పేరుని రాజకీయంగా వాడుకుంటున్నారని, అలాంటి వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ మోహన్ బాబు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.

మోహన్ బాబు ప్రెస్ నోట్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ప్రెస్ నోట్ లో.. ఈ మధ్య కాలంలో నా పేరుని రాజకీయంగా కొందరు ఉపయోగించుకుంటున్నారని నా దృష్టికి వచ్చింది. దయచేసి ఏ పార్టీ వారైనా నా పేరును వారి స్వప్రయోజనాల కోసం వాడుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. మనం అనేక రకాల భావావేశాలున్న వ్యక్తుల ప్రపంచంలో జీవిస్తున్నాము. ఎవరి అభిప్రాయాలు వారివి. అది వారి వ్యక్తిగతం. చేతనైతే నలుగురికి సాయపడడంలోనే మనం దృష్టి పెట్టాలిగాని, సంబంధం లేని వారిని రాజకీయ పార్టీలలోకి, వారి అనుబంధ సంస్థల్లోకి తీసుకురావడం బాధాకరం. నాకు అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి అభివందనాలు తెలియజేస్తూ.. శాంతి, సౌభ్రాతృత్వాలను వ్యాపింపజేయడంలో అందరం బద్ధులై ఉందామని కోరుకుంటూ, ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ.. మీ మోహన్ బాబు అని రాసుకొచ్చారు.

Also Read : Vijay Deverakonda – Rashmika : నువ్వు చెప్పు.. నీకోసం వాళ్ళని పిలుస్తా.. రష్మిక కోసం విజయ్ దేవరకొండ ఆఫర్..

దీంతో మోహన్ బాబు ప్రెస్ నోట్ వైరల్ గా మారింది. అసలు మోహన్ బాబు ఈ రేంజ్ లో రెస్పాండ్ అయ్యేలా ఎవరు ఆయన పేరుని వాడుకున్నారు, మోహన్ బాబు ఎందుకు దీనిని ఇంత సీరియస్ గా తీసుకున్నారు అని చర్చగా మారింది.