Madras High Court: మొదటి భార్యను భర్త సరిగ్గా చూసుకోకపోవడంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

Madras High Court: ఓ మహిళను ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులు వేధించసాగారు. అంతేగాక, అతడు మరో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యతోనే..

Madras High Court

ఇస్లామిక్ చట్టం ప్రకారం బహుభార్యత్వానికి అనుమతి ఉన్నప్పటికీ భార్యలందరినీ భర్త సమానంగా చూడాలని మద్రాస్ హైకోర్టు చెప్పింది. ఒకవేళ భర్త ఈ అంశాన్ని పాటించకపోతే దాన్ని క్రూరత్వం కిందే భావించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు ఆర్‌ఎంటీ టీకా రామన్, పీబీ బాలాజీలతో కూడిన బెంచ్ ఈ మేరకు కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

ఓ ముస్లిం వ్యక్తికి, ఆయన మొదటి భార్యతో జరిగిన వివాహాన్ని రద్దు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. ఓ మహిళను ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులు వేధించసాగారు. అంతేగాక, అతడు మరో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యతోనే జీవిస్తున్నాడు.

మొదటి భార్యను పట్టించుకోలేదు. దీంతో మొదటి భార్య తిరునెల్వేలిలోని ఫ్యామిలీ కోర్టుకు వెళ్లింది. సాక్ష్యాలు పరిశీలించిన న్యాయస్థానం… మొదటి భార్యను, రెండో భార్యను ఆ భర్త సమానంగా చూడలేదని తెలిపింది. ఇస్లామిక్ చట్టాలకు ఇది వ్యతిరేకమని చెప్పింది. మెట్టినింట్లో మొదటి భార్యకు ఎదురైన వేధింపుల గురించి ప్రస్తావించి, పెళ్లి రద్దుకు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పునే తాజాగా మద్రాసు హైకోర్టు సమర్థించింది.

New Years resolutions : 2024 కోసం తీసుకోవాల్సిన బెస్ట్ తీర్మానాలు ఇవే..