New Years resolutions : 2024 కోసం తీసుకోవాల్సిన బెస్ట్ తీర్మానాలు ఇవే..

2024 కు కౌంట్ డౌన్ మొదలైంది. కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానాలు చేసుకున్నారా? లేదంటే కొన్ని ఐడియాలు మీకోసం.

New Years resolutions  : 2024 కోసం తీసుకోవాల్సిన బెస్ట్ తీర్మానాలు ఇవే..

New Years resolutions

New Years resolutions : కొత్త సంవత్సరం ప్రారంభానికి మరికొన్ని రోజులు సమయం ఉంది. కొత్త సంవత్సర ప్రారంభానికి ముందే కొత్త లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. కొత్త తీర్మానాలు చేసుకుంటారు. 2024 కోసం తీర్మానాలు చేసుకున్నారా? లేదంటే మీకోసం కొన్ని ఐడియాలు.. చదవండి మరి.

కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంటే కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకుంటాం. వాటిని సాధించడానికి ఒక ప్రణాళికను కూడా వేసుకుంటాం. అనుకున్నట్లు కొన్ని జరుగుతాయి. కొన్ని రీచ్ కాలేకపోతాం. సాధించిన వాటి నుండి కొన్ని అనుభవాల్ని నేర్చుకుని కొత్త సంవత్సరానికి మార్పులు చేర్పులు చేసుకుంటాం. అయితే Statista.com సర్వే ప్రకారం 2024 కోసం అత్యంత ప్రజాదరణ పొందిన తీర్మానాలు కొన్ని వైరల్ అవుతున్నాయి.

Ways to Welcome the New Year 2024 : ఈ దేశాల్లో కొత్త సంవత్సరాన్ని ఎలా స్వాగతిస్తారో తెలుసా?

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన తర్వాత చాలామందికి డబ్బు విలువ బాగా తెలిసొచ్చింది. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఆర్ధికంగా స్ట్రాంగ్‌గా ఉండాలని ప్రజలు భావిస్తున్నారు. 417 మందిపై చేసిన సర్వేలో  59% మంది ప్రజలు ఎక్కువగా డబ్బు ఆదా చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారట. కాబట్టి వచ్చిన ఆదాయంలో కొంత మొత్తం పొదుపు చేయాలనే లక్ష్యం పెట్టుకుంటే మంచిదే కదా.

కరోనా నేర్పిన గుణపాఠం మరొకటి ఆరోగ్యం. ఆరోగ్యమే మహా భాగ్యం అనే విషయాన్ని అందరూ అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు. కాబట్టి వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడానికి చాలామంది ఆసక్తి కనపరుస్తున్నారట. 50% మంది ప్రజలు జిమ్‌కు వెళ్లాలని కోరుకుంటున్నట్లు చెప్పారట. అంటే కొత్తగా ఏర్పరచుకునే తీర్మానాల్లో శారీరక వ్యాయామానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వండి.

Layoffs Predictions: 2024లో ఎంత మంది ఉద్యోగాలు ఊడిపోనున్నాయో తెలుసా?

చాలామంది ఉద్యోగాలు చేస్తూ బిజీ బిజీగా జీవితాన్ని గడుపుతున్నారు. కుటుంబంతో తప్ప స్నేహితులతో సమయం గడపలేనంత బిజీగా ఉంటున్నారు. అయితే ఈ సర్వేలో 40% మంది ప్రజలు స్నేహితులతో గడిపేందుకు సమయం కేటాయిస్తామని చెప్పారట. ఉరుకుల పరుగుల జీవితంలో కాస్త ఒత్తిడిని తగ్గించుకోవాలంటే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కాసేపైనా చిల్ అవ్వాల్సిందే. ఈ తీర్మానం కూడా యాడ్ చేసుకోండి.

అధిక బరువు అనారోగ్యాలకు కారణమవుతుంది. కాబట్టి కొత్త సంవత్సరం చేసుకునే తీర్మానాల లిస్ట్‌లో బరువు తగ్గడం కూడా పెట్టుకోవచ్చు. 35% మంది అమెరికన్లు 2024 లో బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నారట. మీరు ఓసారి ఆలోచించండి. ఇక కొంతమంది ఇంటి ఫుడ్ కంటే బయట ఫుడ్‌కి వెనకా ముందు ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తారు. 25% మంది అమెరికన్లు ఇలాంటి ఖర్చులు తగ్గించడానికి తీర్మానాలు చేసుకుంటామని చెప్పారట. నిజమే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోగలిగే సమయం ఉండి కూడా కొన్ని ఆహార పదార్ధాల కోసం హోటళ్లకు ప్రిఫరెన్స్ ఇస్తాం. ఆ ఖర్చు తగ్గించుకుంటే ఇంట్లో హాయిగా తినొచ్చు. కొన్ని అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలనుకునే తీర్మానం కూడా యాడ్ చేసుకోండి.

Gold Prediction 2024: గోల్డ్ కొంటున్నారా? 2024లోనూ బంగారం ధర ఆ స్థాయిలో పెరుగుతుందా? సర్వేలో ఏం తేలింది?

సోషల్ మీడియా ఒక వ్యసనంగా మారిపోయింది. దీనికి పూర్తిగా ఎడిక్ట్ అయితే మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుంది. దానికి తోడు ఒత్తిడి కూడా ఎక్కువ అవుతుంది. అలాగే కొందరు చేసే ఉద్యోగంలో ఒత్తిడి అనుభవిస్తారు. 19% మంది సోషల్ మీడియాకు దూరంగా ఉండేందుకు.. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారట. నిజంగానే మనం ఆరోగ్యంగా ఉండటానికి, ఆర్ధికంగా బలపడటానికి, అనుబంధాలు మరింత స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ తీర్మానాలు ఎంతో బావున్నాయి. ఖచ్చితంగా అమలు చేస్తే మన జీవితానికి ఎంతగానో ఉపయోగపడతాయి.