Gold Prediction 2024: గోల్డ్ కొంటున్నారా? 2024లోనూ బంగారం ధర ఆ స్థాయిలో పెరుగుతుందా? సర్వేలో ఏం తేలింది?

తాజాగా రాయిటర్స్ 30 మంది విశ్లేషకులతో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. మీ దగ్గర ఇప్పుడు ఉండే బంగారం విలువ వచ్చే ఏడాది..

Gold Prediction 2024: గోల్డ్ కొంటున్నారా? 2024లోనూ బంగారం ధర ఆ స్థాయిలో పెరుగుతుందా? సర్వేలో ఏం తేలింది?

Gold

Gold Outlook: బంగారం ధరలు 2023లో రికార్డు స్థాయిలో పెరిగాయి. 2024లోనూ ఇదే స్థాయిలో బంగారం రేటు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వడ్డీ రేట్లు పడిపోతుండడం, కేంద్ర బ్యాంకుల నుంచి డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని అంటున్నారు. 2023లో ఇప్పటివరకు బంగారం ధరలు గత ఏడాదితో పోల్చితే 13 శాతం పెరిగాయి.

అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం, అంతర్జాతీయంగా భౌగౌళిక ఉద్రిక్తతలు, మిలటరీ ఘర్షణలు, వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ వైఖరి వల్ల బంగార ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పెట్టుబడులకు బంగారం ఓ స్వర్గధామంలా మారనుంది.

30 మంది విశ్లేషకులతో సర్వే..

తాజాగా రాయిటర్స్ 30 మంది విశ్లేషకులతో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. 2023లో ఉన్న యావరేజ్ గోల్డ్ రేట్ కంటే 2024లో గోల్డ్ రేట్ అధికంగా ఉండనుందని తేలింది. అంతర్జాతీయ మార్కెట్లో యావరేజ్ గోల్డ్ రేట్ ఈ ఏడాది ఔన్సుకు రూ.1,60,107గా ఉంది.

వచ్చే ఏడాది ఇది రూ.1,65,226గా ఉండనుంది. మీ దగ్గర ఇప్పుడు ఉండే బంగారం విలువ వచ్చే ఏడాది పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు చెప్పారు. వచ్చే ఏడాది భారత్‌లో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఉండనుందని ఇప్పటికే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా స్పష్టం చేసింది.

Gold Loans : బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం పోతే ఏం చేయాలి? బ్యాంకులు బాధ్యత వహిస్తాయా?