Gold Loans : బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం పోతే ఏం చేయాలి? బ్యాంకులు బాధ్యత వహిస్తాయా?

Gold Loans : బ్యాంకులో గోల్డ్ లోన్ తీసుకున్నారా? తాకట్టు పెట్టిన మీ బంగారం పోయిందా? దీనికి బ్యాంకులు బాధ్యత వహిస్తాయా? ఇలా సందేహాలు కస్టమర్లలలో వ్యక్తమవుతుంటాయి. తాకట్టు పెట్టిన బంగారం పోతే ఏం చేయాలి? పూర్తివివరాలివే..

Gold Loans : బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం పోతే ఏం చేయాలి? బ్యాంకులు బాధ్యత వహిస్తాయా?

Are you covered for loss of gold deposited in the bank, You Must Know These Things

Updated On : December 20, 2023 / 12:40 AM IST

Gold Loans : ఎన్నో శతాబ్దాలుగా అనేక మంది బంగారంపై రుణాలు తీసుకుంటున్నారు. బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. బంగారం అనేది ఆకర్షణీయమైన పెట్టుబడిగా చెప్పవచ్చు. అలాంటి బంగారం అత్యవసర పరిస్థితుల్లో కుటుంబాన్ని ఆదుకుంటుంది. ఏదైనా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి మెడికల్ ఎమర్జెన్సీకి నిధులు సమకూర్చడంలో మీకు సాయపడుతుంది. తక్షణ నగదు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, సులభంగా తిరిగి పొందడం వంటి అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

Read Also : Benefits of Investing in Gold: 2024లో బంగారంపై పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే 6 లాభాలు ఇవే..

మీరు గోల్డ్ లోన్ పొందడానికి ముందు తప్పనిసరిగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి. అలాగే, బ్యాంకులో బంగారం తాకట్టుపై తీసుకున్న గోల్డ్ లోన్ తిరిగి పొందేవరకు అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కానీ, చాలావరకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ప్రైవేటు ఫైనాన్షియల్ సంస్థలు బంగారాన్ని తాకట్టు పెట్టుకుని లోన్లను అందిస్తుంటాయి. బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకుని తిరిగి చెల్లించకపోతే ఆ బంగారాన్ని రుణాలు ఇచ్చిన సంస్థలు స్వాధీనం చేసుకోవచ్చు.

ఇలా జరిగితే ఆందోళన అక్కర్లేదు.. :
అంతేకాదు.. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత కూడా రుణ సంస్థలపైనే ఉంటుంది. సాధారణంగా బంగారంపై రుణం తీసుకునే ముందు బంగారం నాణ్యతను నిశితంగా పరిశీలించి ఆపై దానికి విలువ కడతారు. ఆ తర్వాతే బ్యాంకులు, రుణ సంస్థలు గోల్డ్ లోన్ ఇవ్వడం జరుగుతుంది.

Are you covered for loss of gold deposited in the bank, You Must Know These Things

loss of gold deposited in the bank

బంగారం రుణాల కోసం బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన తర్వాత నగలు పోయిన అనేక సంఘటనలు లేకపోలేదు. దాంతో బాధితులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ లోన్ తీసుకున్న కస్టమర్లు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. వాస్తవానికి ఇలా జరిగితే కస్టమర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే చెప్పవచ్చు.

బంగారం మాయమైతే.. బ్యాంకులదే బాధ్యత? :
ఎందుకంటే.. బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారమే రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. నిబంధనలకు లోబడి గోల్డ్ లోన్ తీసుకున్న వారి బంగారం దురదృష్టవశాత్తూ పోయినా సదరు బ్యాంకు దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. బ్యాంకులు లోన్ మంజూరు చేయడానికి ముందు తమ ఖాతాదారుల అకౌంట్లలో బంగారం వివరాలను పొందుపరిచి ఉంటారు. లోన్ పొందిన ఖాతాదారుడికి మార్కెట్ ధర ప్రకారమే పరిహారం చెల్లించే బాధ్యత వారిదే..

ఏదైనా సందర్భంలో తాకట్టు పెట్టిన బంగారం పోవడానికి బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే జరిగినట్లు రుజువైతే, దానికి బ్యాంకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. దానికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. రుణాన్ని ఇచ్చేసమయంలో బంగారం బరువు ఎంత ఉందో దాని ఆధారంగా ఖాతాదారులకు బ్యాంకు పరిహారాన్ని అందిస్తుంది. అందుకే, బ్యాంకులో తనఖా పెట్టిన బంగారం విషయంలో ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని బ్యాంకు మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు.

Read Also : Sovereign Gold Bond : గుడ్‌ న్యూస్.. బంగారంలో పెట్టుబడికి ఇదే బెస్ట్ టైమ్.. కేవలం 5 రోజులే సేల్.. గోల్డ్ గ్రాము ధర ఎంతంటే?