Amarinder Singh : సిద్ధూ నాయకత్వంలో ఎన్నికలకు పోలేం..సోనియాకి అమరీందర్ ఫోన్

పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్-కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య రాజకీయ రగడ ఇంకా చల్లారలేదని తెలుస్తోంది.

Amarinder Singh పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్-కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య రాజకీయ రగడ ఇంకా చల్లారలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ హైకమాండ్.. సిద్ధూకి పంజాబ్ పీసీసీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో గురువారం(జులై-15,2021)సీఎం అమరీందర్ సింగ్.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఫోన్ చేశారు.

సిద్ధూ నాయకత్వంలో వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వెళ్లలేమని అమరీందర్ సింగ్..సోనియాగాంధీకి చెప్పినట్లు సమాచారం. సిధ్ధూకి ఎట్టిపరిస్థితుల్లూ పీసీసీ పగ్గాలు ఇవ్వొద్దని సోనియాకి అమరీందర్ విజ్ణప్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే..పార్టీకి సంబంధించి సోనియాగాంధీ ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని ఇటీవల ఆమెను కలిసిన అనంతరం అమరీందర్ సింగ్ చెప్పిన విషయం తెలిసిందే.

కాగా,సిద్ధూకి పీసీసీ అధ్యక్ష పదవి-విజేందర్ సింఘాల,సంత్ కో చౌదరిలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించాలని..సీఎం అమరీందర్ సింగ్ కి క్యాంపెయిన్ కమిటీ చీఫ్,పీఎస్ బజ్వాని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ అయినట్లు ఇంతకుముందు ఆ పార్టీ వర్గాలు చెప్పిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు