Bharat Name Row: భారత్ పేరు మార్పుపై ఓవైపు తీవ్ర వివాదం సాగుతోంది.. ఇంతలో మరోకొత్త పేరు చెప్పిన అస్సాం సీఎం

భారత్ అని మాట్లాడటం, రాయడంలో ఏం సమస్య వస్తోంది? పురావస్తు కాలంలో మన దేశం పేరు భారత్ అని ఉంది. రాజ్యాంగంలో కూడా స్పష్టంగా చెప్పారు. వారు అనవసరంగా, ఉద్దేశపూర్వకంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఇది దురదృష్టకరం

Himanta Biswa Sarma ప్రతిపక్షాలు తమ ఉమ్మడి కూటమికి ఇండియా అని పేరు పెట్టు, ఇది జరిగిన కొద్ది రోజులకే దేశ పేరు మార్పుపై ప్రకటనలు వస్తుండడంతో దేశ రాజకీయం ఇప్పుడు నిప్పుల కొలిమిలో భగభగ మండుతోంది. అధికార భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పటికే భారత్ అనే పేరుకు ట్యూన్ అయిపోయి, ఆ వైపుగా విపరీత ప్రకటనలు చేస్తున్నారు. అనధికారికంగా ఇప్పటికే ఆ పేరును విస్తృతంగా వాడుతున్నారు. ఇంతలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ మరో కొత్త తెరపైకి తెచ్చి మరో వివాదానికి కారణమయ్యేలానే కనిపిస్తున్నారు. బిజెపి ఎంపి హరనాథ్ సింగ్ యాదవ్ భారతదేశం అనే పదాన్ని బ్రిటిష్ వారిని దుర్భాషలాడుతున్నారని, అస్సాం సిఎం హిమంత బిస్వా శర్మ కూడా భారతదేశం గురించి ట్వీట్ చేశారు.

Delhi: భవిష్యత్తులో కూడా ఇలాంటి సాయం చేయాలంటూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన కేజ్రీవాల్

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో ‘రిపబ్లిక్ ఆఫ్ ఇండియా’ అనే సాధారణ పదానికి బదులుగా ‘రిపబ్లిక్ ఆఫ్ భారత్’ని ఉపయోగించారు. మన నాగరికత ఇప్పుడు అమర యుగం వైపు వేగంగా, ధైర్యంగా పయనిస్తున్నందుకు సంతోషంగానూ, గర్వంగానూ ఉందని ఆయన రాసుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం ఆయన తన ఖాతా బయోలో ఇండియా అనే పదాన్ని తొలగించి భారత్ అనే పదం ఉపయోగించారు. అయితే ఇది విపక్ష ఇండియా కూటమి భయంతోనే ఇలా చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

Sharad Pawar: పేరు మార్చే హక్కు ఎవరికీ లేదు.. ఇండియా పేరు మార్పుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శరద్ పవార్

ఇక భారత్ అనే పేరుకు మద్దతుగా బీజేపీ నేతలు వరుస ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ‘‘భారత్ అని మాట్లాడటం, రాయడంలో ఏం సమస్య వస్తోంది? పురావస్తు కాలంలో మన దేశం పేరు భారత్ అని ఉంది. రాజ్యాంగంలో కూడా స్పష్టంగా చెప్పారు. వారు అనవసరంగా, ఉద్దేశపూర్వకంగా గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఇది దురదృష్టకరం” అని అన్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే జీ-20 సదస్సు విందుకు ఆహ్వానం ‘భారత రాష్ట్రపతి’ పేరుతో పంపినట్లు కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ చేసిన ప్రకటనపై ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య వివరణ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని ప్రేమిస్తారని, ప్రతి దేశస్తుడు తన దేశాన్ని ప్రేమిస్తారని అన్న ఆయన.. భారతదేశాన్ని ప్రేమించని వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారని మండిపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు