Amit Shah Yogi
Amit Shah: దేశంలోని కీలక నేతలను చంపుతామంటూ ముంబై crpf కార్యాలయానికి ఓ మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన ఈ మెయిల్ కలకలం రేపుతోంది. ఆగంతకులు పంపిన మెయిల్ లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్లు ఉన్నాయి.
ఆత్మహుతి దాడి చేసి వీరిద్దరిని హత్యచేస్తామని మెయిల్ లో పేర్కొన్నారు దుండగులు. అంతే కాదు దేశంలోని దేవాలయాలు, ప్రముఖ ప్రార్థన మందిరాలపై దాడులు చేస్తామని ఈ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఈ మెయిల్ విషయమై crpf అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
ఎవరు పంపారు. ఎక్కడినుంచి పంపారు అని కూపీ లాగుతున్నారు. మరోవైపు crpf జవాన్లపై జరిగిన దాడిని యావత్ దేశం ఖండిస్తోంది. నక్షలైట్ల దుశ్చర్యలపై మండిపడుతున్నారు దేశ ప్రజలు. ఈ సమయంలోనే ఈ మెయిల్ రావడం కలకలం రేపుతోంది.