Amitabh Bachchans Son In Law : అమితాబ్ బచ్చన్ అల్లుడి మీద చీటింగ్ కేసు..

కుటుంబ వివాదాల కారణంగా లల్లా బాబు జైలు పాలయ్యారు. ఆ తర్వాత జితేంద్ర సొంతంగా ఏజెన్సీని నిర్వహించాల్సి వచ్చిందని, అదే ఇప్పుడీ దురదృష్టకర సంఘటనలకు దారితీసిందని జ్ఞానేంద్ర కన్నీటిపర్యంతం అయ్యారు.

Amitabh Bachchans Son In Law : బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అల్లుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. నిఖిల్ నందా.. అమితాబ్ బచ్చన్ అల్లుడు. ఎస్కార్ట్స్ కుబోటా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. నిఖిల్ నందా.. చీటింగ్, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆరోపణలతో కూడిన తీవ్రమైన చట్టపరమైన కేసులో చిక్కుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలోని డేటాగంజ్ పోలీసులు నిఖిల్ నందాపై కేసు నమోదు చేశారు.

ఈ కేసును డేటాగంజ్ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఎస్కార్ట్స్ కుబోటా ఛైర్మన్ నిఖిల్ నందా.. ఓ ట్రాక్టర్ డీలర్ విషాద మరణానికి సంబంధించిన చీటింగ్, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నారని పోలీసులు తెలిపారు. అమితాబ్ బచ్చన్ కూతురు శ్వేతా నందాను నిఖిల్ నందా వివాహం చేసుకున్నారు. నిఖిల్ నందా రాజ్ కపూర్ మనవడు. కరీనా కపూర్, రణబీర్ కపూర్ కు కజిన్ అవుతారు.

నిఖిల్ నందా, ఆయన కంపెనీకి చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్‌లతో కలిసి సాధ్యం కాని సేల్స్ టార్గెట్ ను రీచ్ అవ్వాలని జితేంద్ర సింగ్ అనే ట్రాక్టర్ డీలర్‌పై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిఖిల్ నందాతో పాటు ఆశిష్ బలియన్ (ఏరియా మేనేజర్), సుమిత్ రాఘవ్ (సేల్స్ మేనేజర్), దినేష్ పంత్ (యుపి హెడ్), పంకజ్ భాస్కర్ (ఫైనాన్షియర్ కలెక్షన్ ఆఫీసర్), అమిత్ పంత్ (సేల్స్ మేనేజర్), నీరజ్ మెహ్రా (సేల్స్ హెడ్), శిషాంత్ గుప్తా (షాజహాన్‌పూర్ డీలర్) ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.

Also Read : చాణక్యుడి ఈ 5 సూత్రాలను పాటిస్తే మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు.. వద్దన్నా వస్తూనే ఉంటుంది.!

జితేంద్ర సింగ్ తరపున ఆయన సోదరుడు జ్ఞానేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిఖిల్ నందా, ఆయన బృందం జితేంద్ర సింగ్ పై తీవ్రమైన ఒత్తిడి చేసిందని వాపోయారు.

జ్ఞానేంద్ర పాపడ్ హంజాపూర్ గ్రామ నివాసి. ఆయన సోదరుడు జితేంద్ర సింగ్ గతంలో తన వ్యాపార భాగస్వామి లల్లా బాబుతో కలిసి డేటాగంజ్‌లో జై కిసాన్ ట్రేడర్స్ అనే ట్రాక్టర్ ఏజెన్సీని నడిపారు. అయితే, కుటుంబ వివాదాల కారణంగా లల్లా బాబు జైలు పాలయ్యారు. ఆ తర్వాత జితేంద్ర సొంతంగా ఏజెన్సీని నిర్వహించాల్సి వచ్చిందని, అదే ఇప్పుడీ దురదృష్టకర సంఘటనలకు దారితీసిందని జ్ఞానేంద్ర కన్నీటిపర్యంతం అయ్యారు.

విక్రయ లక్ష్యాలను చేరుకోకపోతే ఆస్తులను వేలం వేస్తామని, డీలర్‌షిప్ లైసెన్స్‌ను రద్దు చేస్తామని నిందితులు జితేంద్రను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని జితేంద్ర తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పారు.

Also Read : ఐదేళ్లలో కోటి రూపాయలు టార్గెట్.. SIP, Lump Sum ఇంకా ఏయే మార్గాలున్నాయ్.. నెలకి ఎంత పెట్టాలి?

గతేడాది నవంబర్ 21న కంపెనీ అధికారుల బృందం జితేంద్రను కలిసిందని, మరోసారి అమ్మకాలు పెంచాలని ఒత్తిడి తెచ్చిందని జ్ఞానేంద్ర తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మరుసటి రోజే జితేంద్ర ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. నిఖిల్ నందాపై చీటింగ్, బెదిరింపుల కేసు నమోదైంది. ఎస్కార్ట్స్ కుబోటాకు చెందిన పలువురు అధికారుల పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఈ ఆరోపణలపై నిఖిల్ నందా నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.