Earthquake In Manipur : మణిపూర్ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.0గా నమోదు

మణిపూర్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది.

Earthquake In Manipur : మణిపూర్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది. ఉఖ్రుల్ కు 94 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్ర ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 10 కిలో మీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయని తెలిపింది.

శుక్రవారం రాత్రి పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 3.2గా నమోదు అయింది. షామ్లీ కేంద్రంగా రాత్రి 9.31 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.

Earthquake in Delhi: ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు

భూకంపాలపై ఎన్ సీఎస్ తాజా నివేదికల ప్రకారం.. డిసెంబర్ నెలలో భారత్ లో 38 భూకంపాలు నమోదయ్యాయి. మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్‌లలో అత్యధికంగా భూకంపాలు సంభవించాయ. ఈ కాలంలో ఒక్కో రాష్ట్రంలో 6 సార్లు భూ ప్రకంపనలు సంభవించాయని నివేదిక పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు