Tamil Nadu : పంచాయతీ ప్రెసిడెంట్‌గా ఉన్న 89 ఏళ్ల వృద్ధురాలు.. ఆమె ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?

89 సంవత్సరాల వృద్ధురాలు పంచాయతీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. ఆ వయసులో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఆమె ఆరోగ్యం రహస్యం ఏంటో చదవండి.

Tamil Nadu

Tamil Nadu : 89 సంవత్సరాల వయసులో ఎవరి పని వారికి చేసుకోవడమే కష్టమవుతుంది. కానీ ఓ వృద్ధురాలు పంచాయితీ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్న ఆమె ఫిట్‌నెస్ సీక్రెట్‌ను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ప్రెసిడెంట్ స్ఫూర్తిదాయకమైన కథనం చదవండి.

Viral Video : ప్లాస్టిక్ బ్యాగ్ నుంచి ఆహారం తింటున్న జొమాటో డెలివరీ ఏజెంట్.. ఐఏఎస్ ఆఫీసర్ షేర్ చేసిన వీడియో వైరల్

ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. స్ఫూర్తివంతమైన కథనాలు పంచుకుంటారు. తాజాగా తమిళనాడులోని మధురైకి చెందిన 89 సంవత్సరాల పంచాయతీ ప్రెసిడెంట్ వీరమ్మాళ్ జీవితం గురించి షేర్ చేశారు. రీసెంట్‌‌గా ఆమెతో జరిగిన సంభాషణ గురించి అందరితో పంచుకున్నారు. తాజాగా సుప్రియా సాహు అరిట్టపట్టి పంచాయతీ ప్రెసిడెంట్ వీరమ్మాళ్‌ను కలిశారు. ఆమె ఎంతో ఆరోగ్యంగా, యాక్టివ్‌గా కనిపించారు. చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహంగా కనిపించారు. ఈ వయసులో ఇంత యాక్టివ్‌గా ఉండటం వెనుక రహస్యం ఏంటని సుప్రియా ఆమెను ప్రశ్నించినపుడు ఇంటి ఫుడ్ తినడం ముఖ్యంగా సంప్రదాయ భోజనం తినడం, రోజంతా పొలంలో కష్టపడి పనిచేయడం అని వీరమ్మాళ్ చెప్పారు.

Mount Everest : ఎవరెస్టు శిఖరమా? డంపింగ్ యార్డా? .. ఐఏఎస్ ఆఫీసర్ షేర్ చేసిన వీడియో వైరల్

వీరమ్మాళ్‌ను టీ, కాఫీలు తాగుతారా? అని ప్రశ్నించినపుడు చక్కెర వేసుకుని మరీ తాగుతానని చెప్పారు. అంత వయసులో కూడా ఆరోగ్యంగా ఉండటం.. చలాకీగా పనిచేయడం.. పంచాయతీ ప్రెసిడెంట్‌గా గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకోవడం అంటే మామూలు విషయం కాదు. వీరమ్మాళ్‌ను కలిసిన తరువాత సుప్రియా సాహు ఆమెతో మాట్లాడిన వీడియో, ఫోటోలు తన ట్విట్టర్ ఖాతాలో (Supriya Sahu IAS) షేర్ చేసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సాధారణమైన జీవితం గడపడమే ఉత్తమమైన జీవనం అని.. ఆమె గురించి మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు అని నెటిజన్లు కామెంట్లు చేశారు.