Aanand Mahendra
Viral Video: ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహింద్రా తన ట్విటర్ ఖాతాలో ఆసక్తికరమైన వీడియో పోస్టు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆనంద్ మహింద్రా పోస్టు చేసిన వీడియోలో భారత్ లో ఎక్కడో పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చేసిన స్కూటర్ కళ్లు జిగేల్ మనేలా చిన్నచిన్న లైట్లను పొందుపర్చి ఉంది. ఈ స్కూటర్ కు అణువణువు చిన్న చిన్న లైట్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ స్కూటర్ ముందు భాగంలో హ్యాండిల్ కు ట్యాబ్ కూడా ఉంది. స్కూటర్ నడుపుకుంటూ ఈ ట్యాబ్ లో సినిమాలు, వీడియోలు చూడొచ్చు. ఈ వీడియో తీస్తున్న సమయంలో ఆ ట్యాబ్ అన్ అయ్యేఉంది. రాజేష్ ఖన్నా నటించిన ‘దో రాస్తే’లోని ‘చుప్ గయే సారే నజారే’ పాట వీడియో ప్లే అవుతుంది.
Life can be as colourful and entertaining as you want it to be… #OnlyInIndia pic.twitter.com/hAmmfye0Fo
— anand mahindra (@anandmahindra) June 17, 2022
ఆనంద్ మహింద్రా ఈ పోస్టుకు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. జీవితం మీరు కోరుకున్నంత రంగుల, వినోదాత్మకంగా ఉంటుంది అంటూనే యాస్ ట్యాగ్ ఇచ్చి ఇండియాలో మాత్రమే అని రాశారు. ఆనంద్ మహింద్రా పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. ఇప్పటికే మూడు లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 16వేల మంది లైక్ లు కొట్టారు. పలువురు నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. “బజాజ్ చేతక్.. సార్ మేము దీని మీద 250 కి.మీ ప్రయాణించి ఒక హిల్ స్టేషన్ కి వెళ్ళాము. మా బజాజ్” అని ఒక నెటిజన్ రీట్వీట్ చేశాడు. మరో నెటిజన్.. ఇలా తయారు చేయాలంటే ఎంతో ప్రతిభ ఉండాలి. ఈ ప్రతిభను పెంపొందించుకోవాలి అంటూ రీ ట్వీట్ చేశాడు. ఇలా పలువురు నెటిజన్లు ఈ వీడియో చూసి వావ్ అంటూ అభినందిస్తూ రీ ట్వీట్లు చేశారు.