Mahindra
Anand Mahindra: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన దేశభక్తి ప్రతిబింబించేలా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఉంటూ తన మనోభావాలను పంచుకునే ఆయన తాజాగా అమెరికాలో పర్యటిస్తూ ఓ ఫొటో షేర్ చేశారు. దానికి నెటిజన్ అడిగిన ఓ తుంటరి ప్రశ్నకు ఇలా సమాధానమిచ్చారు.
దేశంపై తనకున్న అభిమానాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కొత్త అర్థంలో చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ఫొటోను చూసి మీరు ఎన్నారైయా అని అడిగాడు. ఇంతకీ ఆ కథేంటంటే..
ఆనంద్ మహీంద్రా జులై 4న న్యూయార్క్ లోని మాన్హాటన్‌లో ఉన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆప్ అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం అదే రోజు కావడంతో ప్రత్యేక అలంకరణాలు కనిపించాయి. మాన్హాటన్ నగరం అందాల్ని కెమెరాలో బంధించి సంబంధిత వీడియోలను, ఫొటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారాయన.
Read Also : మహేష్ బాబు సినిమాను చూడకుండా ఎలా ఉండగలను.. ఆనంద్ మహీంద్రా
వాటికి ‘జులై 4వ తేదీన మాన్హాటన్ స్కైలైన్’ అనే క్యాప్షన్‌ను జోడిస్తూ.. పోస్టు పెట్టారు. ఓ నెటిజన్ ‘మీరు ఎన్నారైనా?’ అంటూ ప్రశ్నించాడు. దీనికి ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘న్యూయార్క్‌లోని ఫ్యామిలీ చూడటానికి వచ్చా. అందువల్ల నేను హెచ్ఆర్ఐని (హార్ట్ రెసిడెంట్ ఇన్ ఇండియా)’ అంటూ బదులిచ్చారు. అలా మరోసారి ఆనంద్ మహీంద్రా నెటిజన్ల మనసు దోచుకున్నారు.
Just visiting family in New York. So am an HRI. Heart (always) resident in India….? https://t.co/ydzwTux9vr
— anand mahindra (@anandmahindra) July 5, 2022