నేవీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్

భారత నావికాదళంలో మహిళా అధికారుల సేవలను పర్మినెంట్ కమిషన్ చేయటంపై సుప్రీంకోర్టు మంగళవారం(మార్చి 17, 2020) న తుది తీర్పును వెల్లడించింది. మహిళా అధికారులు శాశ్వత కమిషన్‌కు దరఖాస్తు చేసుకోవటాన్ని నిరాకరించలేం. మగ అధికారులతో సమానంగా మహిళా అధికారులను చూడాలని జస్టిస్ డి.వై చంద్రచుడ్, జస్టిస్ అజయ్ రాస్తోగి ధర్మాసనం తెలిపింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) లో మహిళా అధికారులను 3 నెలల్లోగా శాశ్వత కమిషన్ గా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
నావీలో సమస్యలపట్ల మహిళలకు సరైన అవగాహన లేకపోవటం, కొన్ని నౌకలలో టాయిలెట్స్ సౌకర్యాలు లేకపోవటం వంటి ఇబ్బందులున్నాయి. వాటిని సరిదిద్దుకోవచ్చు. శారీరక దారుఢ్యం, మాతృత్వంవంటి కారణాలతో లింగ వివక్షత చూపించలేమని కోర్టు తేల్చేసింది.
ఢిల్లీ హైకోర్టులో SSC లో శాశ్వత కమిషన్ కోసం న్యాయ పోరాటం చేసి గెలిచిన ఐదుగురు మహిళా అధికారులకు రూ. 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నది కోర్టు ఆదేశం. పదవి విరమణ చేసిన ఎస్ఎస్‌సీ మహిళా అధికారులకు పెన్షన్ మంజూరు చేయమంది కోర్టు.
షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) లో పదవి విరమణ చేసే వరకు ఒక అధికారికి నేవీలో పనిచేయటానికి శాశ్వత కమిషన్ అర్హత కల్పించింది. ప్రస్తుతం 10 సంవత్సరాలు ఉన్న సమయాన్ని మరో నాలుగు సంవత్సరాలు పొడిగించింది. అంటే మెుత్తం 14 సంవత్సరాలు.ఇప్పటి నుంచి నేవీలో అర్హత ఉన్నఅన్ని విభాగాల్లో మహిళా అధికారులు పని చేయవచ్చు. కోర్టు తీర్పు ప్రకారం ATC & లాజిస్టిక్స్లో శాశ్వత కమిషన్ కు కూడా మహిళలు అర్హులు.
See Also | NLC లో గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు