Omicron Scare Dont Panic People About New Variant, Must Be Taken Precautions
Omicron Variant: కరోనా తగ్గుముఖం పట్టినవేళ వెలుగులోకి వచ్చిన వేరియంట్ ఒమిక్రాన్ ప్రజలను కంగారు పెట్టేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒమిక్రాన్‌పై అలర్ట్ అవుతున్నాయి. లేటెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ పెట్టుకోకుంటే వంద రూపాయలు జరిమానా విధించాలంటూ ఉత్తర్వులు విడుదల చేసింది.
మాస్కుల్లేని వారిని దుకాణాల్లో, వాణిజ్య ప్రదేశాల్లో, వ్యాపార సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతిస్తే సదరు యాజమాన్యానికి పది వేల రూపాయల నుంచి రూ. 25వేల వరకు జరిమానా విధించనున్నట్లు చెప్పారు. ఎవరైనా సరే ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే వ్యాపార సంస్థలను 2 రోజులు మూసివేసేలా చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
Vaccinated in Marriage Halls : పెళ్లి మండపంలో ఆరోగ్య కార్యకర్తలు..అతిధులకు కరోనా వ్యాక్సినేషన్
ఉల్లంఘనలకు పాల్పడితే, 8010968295 నెంబరుకు వాట్సప్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయవచ్చని ప్రభుత్వం సామాన్యులకు కూడా సూచించింది. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా రూల్స్ ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ, ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేయనున్నారు పోలీసులు.