Ayodhya Rama Mandiram
Ayodhya Rama Mandiram : 2023 చివరి నాటికి రామమందిర నిర్మాణం పూర్తి చేసి దర్శనాలు ప్రారంభిస్తామని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. దేవాలయం పరిసరాల్లో ఉన్న మొత్తం 70 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాలను 2025 వరకు పూర్తి చేస్తామని తెలిపింది.
గురువారం 15 మంది ట్రస్ట్ సభ్యులు, వాస్తు శిల్పులు, ఇంజనీర్లతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శ్రీ రామ్ తీర్ధ ట్రస్ట్ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా అధ్యక్షత వహించారు. 2023 నాటికి గర్భగుడి నిర్మాణం పూర్తై భక్తులకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
కాగా 2020 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆలయానికి పునాది వేశారు. ప్రస్తుతం దేవాలయ మొదటి దశ పనులు సాగుతున్నాయి. నవంబర్ నెలలో రెండవ దశ పనులు ప్రారంభం అవుతాయని ఇంజినీర్లు తెలిపారు.