Anti-Drone Systems : ఇక సరిహద్దు రాష్ట్రాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు…కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా వెల్లడి

పొరుగు దేశమైన పాకిస్థాన్ నుంచి తరచూ డ్రగ్స్, ఆయుధాలు డ్రోన్ల ద్వారా రవాణ అవుతున్న నేపథ్యంలో భారతదేశం అప్రమత్తమైంది. పాక్ సరిహద్దుల మీదుగా రవాణ అవుతున్న డ్రగ్స్, ఆయుధాలను నియంత్రించడానికి సరిహద్దు రాష్ట్రాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.....

Anti Drone Systems

Anti-Drone Systems : పొరుగు దేశమైన పాకిస్థాన్ నుంచి తరచూ డ్రగ్స్, ఆయుధాలు డ్రోన్ల ద్వారా రవాణ అవుతున్న నేపథ్యంలో భారతదేశం అప్రమత్తమైంది. పాక్ సరిహద్దుల మీదుగా రవాణ అవుతున్న డ్రగ్స్, ఆయుధాలను నియంత్రించడానికి సరిహద్దు రాష్ట్రాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని భారత్ నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. (Anti-Drone Systems To Be Deployed) అమృత్‌సర్‌లో 31వ ఉత్తర జోనల్ సదస్సుకు అమిత్ షా అధ్యక్షత వహిస్తూ ఈ విషయాన్ని తెలిపారు.

Nita Ambani Award : నీతా అంబానీకి ప్రతిష్టాత్మక ‘సిటిజన్ ఆఫ్ ముంబై’ అవార్డు..!

మాదక ద్రవ్యాలు, ఆయుధాల రవాణకు బ్రేక్ వేసి, ఉగ్రవాదాన్ని నియంత్రించేందుకు తాము అన్ని సరిహద్దు రాష్ట్రాల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థలను మోహరిస్తామని అమిత్ షా చెప్పారు. (Deployed In All Border States) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో ప్రభుత్వం విజయవంతమైందని ఆయన ఉద్ఘాటించారు.

Chandrababu Quash Petition : సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు, విచారణ చేసే బెంచ్ ఇదే.. ఊరట లభిస్తుందా?

సరిహద్దుల్లో భద్రతా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలో మన దేశ సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరిస్తామని షా సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హామీ ఇచ్చారు. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు, ఢిల్లీ, జమ్మూ,కాశ్మీర్,లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లు, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.

CM KCR : సీఎం కేసీఆర్‌కు అస్వస్థత, చికిత్స అందిస్తున్న వైద్యులు

ఈ సమావేశంలో సీనియర్ మంత్రులు కూడా పాల్గొన్నారు. వరదలు ఎదుర్కొంటున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలుస్తుందని షా చెప్పారు. డ్రోన్ టెక్నాలజీ,యాంటీ డ్రోన్ చర్యలలో నైపుణ్యం కలిగిన ప్రత్యేక బృందాలు సరిహద్దుల్లో మోహరిస్తామని అమిత్ షా (Amit Shah) వివరించారు.

ట్రెండింగ్ వార్తలు