University (2)
Election Commissioner కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా రిటైర్డ్ IAS అధికారి అనూప్ చంద్ర పాండే బుధవారం బాధ్యతలు స్వీకరించినట్లు భారత ఎన్నికల సంఘం(ECI)ఓ ప్రకటనలో తెలిపింది. 1984 బ్యాచ్ ఉత్తర్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన అనూప్ చంద్ర పాండే..యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి 2019లో పదవీ విరమణ పొందారు. కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో అనూప్ పనిచేశారు. రక్షణ,కార్మిక మరియు ఎంప్లాయిమెంట్ మంత్రిత్వశాఖల్లో అనూప్ సేవలందించారు.
కాగా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా పనిచేసిన సునీల్ అరోరా.. ఏప్రిల్ 12 న పదవీ విరమణ చేసిన నాటి నుంచి ముగ్గురు సభ్యుల కమిషన్‌లో ఒక కమిషనర్ పదవి ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈ స్థానంలో అనూప్ చంద్ర పాండేని నియమిస్తూ మంగళవారం రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్‌లో అనూప్ చంద్ర పాండే మూడేళ్ల పాటు ఉండనున్నారు. 2024 ఫిబ్రవరి వరకు ఆయన పదవీ కాలం ఉంది.