Manmohan Singh: ఆ సమయంలో డబ్బుల్లేక పస్తులున్న మన్మోహన్ సింగ్.. పీఎం హోదాలో కీలక నిర్ణయాలు

భారత మాజీ ప్రధాన మంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు.

Manmohan Singh

Manmohan Singh passes away: భారత మాజీ ప్రధాన మంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన మన్మోహన్ సింగ్ ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో గురువారం రాత్రి 8.30 గంటల సమయంలో తుది శ్వాస విడించారు. మన్మోహన్ సింగ్ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు.

Also Read: Manmohan Singh : మన్మోహన్ సింగ్ కన్నుమూత.. 7 రోజులు జాతీయ సంతాప దినాలు

పదేళ్లలో ఎన్నో కీలక నిర్ణయాలు..
మన్మోహన్ సింగ్ కు భార్య గురుశకరణ్ కౌర్, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా పేరుపొందిన ఆయన్ను 1987లో ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రి హోదాలో దేశానికి మన్మోహన్ సింగ్ సేవలందించారు. ఆ సమయంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటు, సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకం, అమెరికాతో అణు ఒప్పందం, చంద్రయాన్, మంగళ్ యాన్, విద్యాహక్కు చట్టం, ఆహార భద్రత చట్టం, ఆధార్ కార్డుల వంటివి మన్మోహన్ సింగ్ హయాంలో రూపుదిద్దుకున్నవే. అయితే, 33ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన ఆయన గత కొద్దికాలంలో అనారోగ్య కారణాలతో క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Also Read: Manmohan Singh : దేశం గొప్ప నేతను కోల్పోయింది- మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ సహా ప్రముఖుల సంతాపం..

డబ్బుల్లేక పస్తులు..
1932లో మన్మోహన్ సింగ్ అతి సాధారణ కుటుంబంలో జన్మించారు. కిరోసిన్ దీపాల వెలగులో విద్యను అభ్యసించారు. మన్మోహన్ సింగ్ కాస్త నెమ్మదస్తుడైనప్పటికీ.. అతని ఆలోచనలు పాదరసంలాంటివి. అతి సాధారణ కటుంబంలో పుట్టినప్పటికీ పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలను ఆయన అదిరోహించారు. మన్మోహన్ కుమార్తె దమన్ సింగ్ రాసిన ‘స్ట్రిక్ట్ లీ పర్సనల్, మన్మోహన్ అండ్ గురుశరణ్’’ అనే పుస్తకంలో కీలక విషయాన్ని ప్రస్తావించారు. మన్మహన్ కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో చదివే సమయంలో డబ్బుల్లేక చాలా ఇబ్బంది పడ్డారట. ఒక్కోరోజు భోజనం చేసేందుకు సైతం డబ్బుల్లేక కేవలం ఒక్క చాక్లెట్ తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిదట. అప్పట్లో మన్మోహన్ ట్యూషన్ ఫీజు, రోజువారీ ఖర్చుల కోసం ఏడాదికి 600 పౌండ్లు అయ్యేవి. పంజాబ్ యూనివర్శిటీ 160 పౌండ్లు స్కాలర్ షిప్ గా ఇవ్వగా.. మిగిలిన సొమ్ము తన తండ్రి పంపించేవారట. తండ్రి పంపించిన డబ్బులో ప్రతీపైసను జాగ్రత్తగా ఖర్చు చేసుకుంటూ, యూనివర్శిటీలో రాయితీపై చౌకగా వచ్చే భోజనం మాత్రమే చేశారు. ఒక్కోరోజు భోజనం కూడా మానేసి కేవలం ఒక్క చాక్లెట్ తోనే సరిపెట్టుకునేవారు. ప్రతీపైసను జాగ్రత్తగా వాడుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ పదేళ్లు ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ సేవలందించారు.

తెలంగాణలో విద్యా సంస్థలు బంద్..
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా వారం రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని గురువారం రాత్రి సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.