Salt Facts: ఉప్పు గురించి ఒప్పుకోవాల్సిన నిజాలు..
ఉప్పు అంటే మనం ఆహారంలో వేసుుకునేది అని మాత్రమే తెలుసు. కానీ ఉప్పు గురించి ఒప్పుకోవాల్సిన నిజాల గురించి తెలుసుకుందాం..

Salt
Salt Facts: ఉప్పు లేకుండా మనకు రోజు కాదు కదా ఒక్కపూట కూడా గడవదు. కూర,పచ్చడి,చారు ఇలా ఏది చేసినా ఉప్పు ఉండాల్సిందే. లేదంటే నోట్లో పెట్టలేం. బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు కూడా ఉప్పు కాస్త తగ్గించి తింటారు తప్ప అస్సలు లేకుండా అయితే తినరు. మన భూభాగంలో 70 శాతం నీరే ఉంది. ఈ నీటి వరరుల్లో ఎక్కువ శాతం సముద్రాలే.ఈ సముద్రాలన్నీ ఉప్పు మయాలే. సముద్రపు నీటితో తయారయ్యే ఉప్పుగురించి ఆశ్చర్యకరమైన కొన్ని సంగతులు తెలుసుకుందాం. ఉప్పుగురంచి ఒప్పుకోవాల్సిన నిజాల గురించి తెలుసుకుందాం..
ఉప్పు అంటే రోజువారీ కూరల్లో రుచికోసం వేసుకునే ఓ పదార్థంగా మాత్రమే చాలామందికి తెలుసు. కానీ దీని గురించి పరిశోధించిన శాస్త్రవేత్తలకు చిత్రమైన విషయాలు తెలిశాయి. తెల్లగా, నీటిలో వెయ్యగానే కరిగిపోయే ఉప్పుతో జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలిసొచ్చింది. సాల్ట్ ఎక్కువగా తింటే హైబీపీ సమస్యలు వస్తాయి.అలాగే ఎముకల సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతుంటారు. ఉప్పు శాస్త్రీయ నామమే సోడియం క్లోరైడ్. సోడియం (లవణం) మోతాదు పెరిగితే గుండెజబ్బులు, ఒబేసిటీ, కిడ్నీ సమస్యలు, జీర్ణకోశ క్యాన్సర్ వంటి రుగ్మతలూ రావచ్చు. కానీ ఉప్పుతో ముప్పులే కాదు ప్రయోజనాలు కూడా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం..
గాయాలు శుభ్రం: కుక్క కరిస్తే వెంటనే గాయాన్ని సబ్బుతో కడగాలి అని చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ సబ్బు కంటే ఉప్పు నీటితో గాయాల్ని కడిగితే..ఇన్ఫెక్షన్లు రావని పరిశోధనల్లో తేలింది. సబ్బుల్లో ఉండే కొన్ని రసాయినాలు లోపలి చర్మానికి హాని కలిగిస్తాయి. అదే ఉప్పు నీటితో కడిగితే అటువంటి సమస్యలు రావని చెబుతున్నారు సైంటిస్టులు.
ఉప్పు ఎక్కువైతే ముప్పే : ఉప్పు ఎక్కువైనా..తక్కువైనా ఇబ్బందే. ఉప్పు ఎక్కువగా తింటే.. మెదడులో మంట, నొప్పి, దురదల వంటివి రావటానికి అవకాశాలున్నాయట. దీని గురించి ఎలుకలపై ప్రయోగాలు చేశారు పరిశోధకులు. ఉప్పు ఎక్కువ అయిన ఎలుకలు అయోమయంగా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించినట్లుగా తేలింది. కానీ ఉప్పుని సరిపడా తిన్న ఎలుకలు మాత్రం సాధారణంగా ఉన్నాయని తేలింది వీరి పరిశోదనలో.
మృత సముద్రం కింద శాస్త్రవేత్తలు డ్రిల్లింగ్ చేసి సాల్ట్ శాంపిల్స్ సేకరించారు.వర్షాలు బాగా పడినప్పుడు భూమిలో ఉప్పు పొర తక్కువగా పేరుకుంటుంది. శాస్త్రవేత్తల పరిశోధనను బట్టీ గత 10 లక్షల సంవత్సరాల్లో భూమిపై చాలా కరవు కాటకాలు వచ్చాయి. ఆ స్థాయి కరవు ఇప్పుడు వస్తే, తట్టుకోవడం కష్టమే.
షుగర్ ఎక్కువ తీసుకుంటే కలిగే నష్టాలేంటో ప్రపంచంలో చాలా మందికి తెలుసు. అందువల్ల చక్కెర వాడకాన్ని చాలావరకూ తగ్గించారు. ఉప్పు ఎక్కువ తీసుకుంటే ప్రమాదం అనే విషయం చాలా మందికి తెలియదు. అందువల్ల ప్రపంచ దేశాల్లో ఉప్పును ఎక్కువగా తీసుకుంటున్నారు. దీన్ని కంట్రోల్ చెయ్యాలని సాక్షాత్తు డబ్ల్యూ హెచ్ వోనే తెలిపింది.డానికి ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.