COSC చైర్మన్ గా బాధ్యతలు స్పీకరించిన ఆర్మీ చీఫ్

చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (COSC) చైర్మన్‌గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ శుక్రవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ బాధ్యతల స్పీకరణ కార్యక్రమంలో ఇప్పటివరకు సీఓఎస్సీ చైర్మన్ గా ఉన్నఏయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పజెప్పారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ కరంబిర్ సింగ్ కూడా పాల్గొన్నారు. ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) ను నియమిస్తున్నట్లు ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇందులో భాగంగానే త్రివిధ దళాల్లో అత్యంత సీనియర్‌గా ఉండటంతో బిపిన్ రావత్‌కే ఈ పదవి వరించింది.
 
 ఈ సంవత్సరం డిసెంబర్ వరకు బిపిన్ రావత్ ఈ పదవిలో కొనసాగనున్నారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన రావత్‌కు ఆపరేషన్స్‌లో విశేషమైన, అపారమైన అనుభవం ఉంది. 2016 డిసెంబర్ లో ఆర్మీ చీఫ్ గా రావత్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.